థియేటర్లనే కాదు.. యూట్యూ‌బ్‌నూ షేక్ చేస్తోంది

థియేటర్లనే కాదు.. యూట్యూ‌బ్‌నూ షేక్ చేస్తోంది

‘జనతా గ్యారేజ్’కు డివైడ్ టాక్ వచ్చినా బ్లాక్‌బస్టర్ హిట్టయిందంటే అందుకు కొన్ని కారణాలున్నాయి. ఆ కారణాల్లో కాజల్ చేసిన ఐటెం సాంగ్ కూడా ఒకటనడంలో సందేహం లేదు. సెకండాఫ్ ఒక దశలో ట్రాక్ తప్పుతున్నట్లు అనిపించిన టైంలో ‘పక్కా లోకల్’ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుంది. మాస్ ఆడియన్స్‌ ఈ పాటతో భలేగా కనెక్టయిపోయారు. కాజల్ అందచందాలు.. ఎన్నడూ లేని విధంగా ఆమె చేసిన ఊర మాస్ డ్యాన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘జనతా గ్యారేజ్’లోని ఇద్దరు హీరోయిన్ల కంటే కూడా కాజల్ గురించే రిలీజ్ టైంలో ఎక్కువ చర్చ జరిగింది. టాప్ హీరోయిన్స్ చేసిన ఐటెం సాంగ్స్‌లో కాజల్ పాటే నెంబర్ వన్ అనిపించుకుంది.

వారం కిందట ‘జనతా గ్యారేజ్’లోని పాటల్లో మూడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఐతే ఆ రోజు ‘పక్కా లోకల్’ పాట రిలీజ్ చేయనందుకు అభిమానులు చాలా ఫీలయ్యారు. ఐతే అది స్పెషల్ సాంగ్ కావడంతో స్పెషల్‌గా దసరా కానుకగా యూట్యూబ్‌లోకి వదిలారు. ఇలా ఆ పాట యూట్యూబ్‌లోకి వచ్చిందో లేదో.. హిట్స్ మోతెక్కిపోయాయి. ఒక్క రోజు వ్యవధిలోనే మిలియన్ మార్కును టచ్ చేసింది ఈ పాట. ప్రస్తుతం 13 లక్షల మంది దాకా ఈ పాటను వీక్షించారు. దీన్ని బట్టే పక్కా లోకల్ పాట కోసం జనాలు ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘జనతా గ్యారేజ్’లోని మిగతా పాటలకు కూడా యూట్యూబ్‌లో రెస్పాన్స్ బాగుంది. యాపిల్ బ్యూటీ పాట 2 మిలియన్ మార్కును దాటేయగా.. రాక్ ఆన్ బ్రో కూడా 15 లక్షల దాకా వ్యూస్ తెచ్చుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు