ప్రేమమ్.. దుమ్ముదులిపిందిగా

ప్రేమమ్.. దుమ్ముదులిపిందిగా

ఇంతకుముందు నాగచైతన్య సోలో హీరోగా నటించిన సినిమాలు యుఎస్‌లో ఫుల్ రన్లోనూ హాఫ్ మిలియన్ మార్కుకు చేరేవి కావు. కానీ ‘ప్రేమమ్’ మాత్రం ఫస్ట్ వీకెండ్లోనే ఆ మార్కును అందుకుంది. ప్రిమియర్ షోలతో కలుపుకుని ఆదివారానికే ఈ చిత్రం 5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. గురువారం ప్రిమియర్లతో 75 వేల డాలర్లు వసూలైతే.. శుక్రవారం 1.35 లక్షల డాలర్లు వసూలయ్యాయి.

శనివారం అనూహ్యంగా 2 లక్షల డాలర్ల దాకా కలెక్షన్లు రావడం విశేషం. ఆదివారం కూడా 1.2 లక్షల డాలర్ల దాకా వసూలయ్యాయి. అలా ఒక్క వీకెండ్‌కే హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసింది ‘ప్రేమమ్’. ఫుల్ రన్లో ఈ సినిమా యుఎస్‌లో ఈజీగా మిలియన్ మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్కడ 120 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తర్వాతి వీకెండ్లో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం.. దసరాకు వచ్చిన మిగతా సినిమాలకు అంత మంచి టాక్ లేకపోవడం కలిసొచ్చే అంశం.

ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్లో ‘ప్రేమమ్’ రూ.15 కోట్ల గ్రాస్.. రూ.9.2 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.6 కోట్లకు పైగా షేర్ వచ్చింది. కర్ణాటకలో సైతం ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. దసరా సెలవులు కావడంతో వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.20 కోట్ల షేర్ మార్కును అందుకుని.. నాగచైతన్య కెరీర్లో సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్టయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English