దిల్ రాజు చేతికి ఆ కమెడియన్ సినిమా?

దిల్ రాజు చేతికి ఆ కమెడియన్ సినిమా?

కమెడియన్లు ఒక్కొక్కరుగా హీరోలైపోతున్న తరుణమిది. ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి ‘గీతాంజలి’లో హీరో కాని హీరో పాత్ర వేశాడు.ఈసారి మాత్రం అలా కాకుండా పూర్తి స్థాయి హీరో అవతారం ఎత్తుతున్నాడు. ఆ సినిమానే ‘జయమ్ము నిశ్చయమ్మురా’. శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఇప్పటిదాకా ప్రోమోలతో బాగానే ఆకట్టుకుంది. ఈ మధ్యే సుకుమార్ ఓ పాట కూడా రిలీజ్ చేశాడు. అది కూడా బాగానే అనిపించింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది. మంచి డేట్ కోసం చూస్తున్నాడు శ్రీనివాసరెడ్డి.

‘జయమ్ము నిశ్చయమ్మురా’ గురించి తాజాగా వినిపిస్తున్న ఆసక్తికర కబురేంటంటే.. ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నాడట. ఈ మధ్యే రాజుకు ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించారట. ఆయనకు నచ్చడంతో తన బేనర్ మీద రిలీజ్ చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం. దిల్ రాజు గతంలో ఇలాంటి చిన్న సినిమాల ప్రివ్యూలు చూసి తనే రిలీజ్ చేశాడు. అవి మంచి విజయం సాధించాయి. దిల్ రాజు ముద్ర పడిందంటే సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేస్తుంది. నిజంగా అదే జరిగితే శ్రీనివాసరెడ్డి పంట పండినట్లే. ఈ సినిమాకు నిర్మాత కూడా దర్శకుడు శివరాజ్ కనుమూరినే. ఓ అబ్బాయి-అమ్మాయి కలిసి కరీంనగర్ నుంచి కాకినాడకు ప్రయాణం చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరి మధ్య ఎలాంటి బంధం ఏర్పడిందో చూపించే సినిమా ఇది. శ్రీనివాసరెడ్డి సరసన పూర్ణ కథానాయికగా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు