సునీల్ సినిమా అదే టైటిల్ ఫిక్స్

సునీల్ సినిమా అదే టైటిల్ ఫిక్స్

కొంచెం ఇమేజ్ ఉన్న హీరోలకే వరుసగా రెండు మూడు ఫ్లాపులు వచ్చాయంటే పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతుంది. అలాంటిది కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ వరుసగా నాలుగు ఫ్లాపులు తిన్నాడు. అతడి లేటెస్ట్ మూవీ ‘ఈడు గోల్డ్ ఎహే’ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఈ సినిమా నెగెటివ్ టాక్‌తోనే మొదలైంది. దీంతో సునీల్ ఖాతాలో మరో నిరాశాజనక ఫలితం చేరినట్లే. దసరా సెలవుల అడ్వాంటేజీ వల్ల నష్టాలు పెద్దగా ఉండకపోవచ్చేమో కానీ.. సునీల్ కోరుకున్న ఫలితం అయితే రానట్లే. ఈ నేపథ్యంలో ఇక సునీల్ ఆశలన్నీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీదే ఉన్నాయి.

ఓనమాలు, మళ్లీ మళ్లీ రాని రోజు లాంటి ఎమోషనల్ సినిమాలు తీసిన క్రాంతి మాధవ్.. సునీల్‌తో సినిమా చేయాలనుకోవడం ఆశ్చర్యమే. ఐతే ఈసారి క్రాంతి మాధవ్ తన శైలికి భిన్నంగా.. సునీల్‌కు సూటయ్యేలా కామెడీ సినిమా చేస్తున్నాడట. ఇది ఆద్యంతం నవ్వించే సినిమా అని.. ప్యూర్ కామెడీ అని అంటున్నారు. ఈ చిత్రానికి కొన్నాళ్లుగా అనుకుంటున్నట్లే ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ ఖాయం చేశారు. ఇందులో సునీల్ జాతకాల్ని నమ్మి ఉంగరాలు పెట్టుకునే కుర్రాడిగా కనిపిస్తాడట. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సరసన మలయాళ అమ్మాయి మియా జార్జ్ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ఆఖర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు