రాజశేఖర్‌కు లింక్‌ వేశారా...

రాజశేఖర్‌కు లింక్‌ వేశారా...

మెగా ఇంట ఏదైనా సంఘటన జరిగిందంటే చాలు, దానిని వెంటనే నటుడు రాజశేఖర్‌, ఆయన భార్య జీవితకు లింకేస్తారు కొంతమంది ఎల్లో మీడియా ప్రభుద్దులు. రీసెంట్‌గా రామ్‌ చరణ్‌కు, ఇద్దరు సాఫ్టవేర్‌ ఇంజీనర్లకు మధ్య జరిగిన ఘర్షణ మనకు తెలిసిందే.

అయితే ఈ సంఘటనను మన యాంగ్రీ హీరో రాజశేఖర్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ కొన్ని మీడియా హౌజ్‌లు తెగ సంబరపడుతూ చెప్పేస్తున్నాయి. ఒక ప్రక్కన రాజశేఖర్‌ మొన్న జరిగిన హీరో గోపిచంద్‌ పెళ్లిలో పవన్‌ కళ్యాణ్‌ను మచ్చిక చేసుకుంటూ మెగా ఫ్యామిలీకి దగ్గరకావాలని చూస్తుంటే, ఇలా కొంతమంది మీడియాలు చరణ్‌ మ్యాటర్‌ను మనోడు ఎంజాయ్‌ చేస్తున్నాడని రాయడం విడ్డూరంగా ఉంది. అసలు మెగా ఇంట ఏ సీన్‌ చోటుచేసుకున్నా దానిని రాజశేఖర్‌తో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అని కొంతమంది సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ఏముందండీ, చరణ్‌ పేరు చెప్పినా, మెగా ఫ్యామిలీకి ఏం లింక్‌ చేసినా ఆ వార్తలకు పిచ్చ క్రేజ్‌ వస్తుంది. అందుకే అలా లింకులు వెయ్యడం. అర్ధమయ్యిందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English