ఆ డైరెక్టర్.. ఆ హీరోయిన్.. కటీఫ్

ఆ డైరెక్టర్.. ఆ హీరోయిన్.. కటీఫ్

కటీఫ్ అనగానే ఇదేదో వేరే రకమైన బంధం అనుకోకండి. ఇది చాలా మంచి బంధమే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్.. స్టార్ హీరోయిన్ కాజోల్ ఎంత మంచి స్నేహితులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కరణ్ తొలి సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’లో కాజోలే హీరోయిన్. ఆ తర్వాత కూడా ఆయన సినిమాల్లో తరచుగా కనిపించేది కాజోల్. కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాల్లోనూ ఆమె కథానాయికగా నటించింది. ఐతే ఈ మధ్య అనుకోకుండా కరణ్ జోహార్‌తో కాజోల్ ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కాజోల్ భర్త అజయ్ దేవగణే చెప్పడం విశేషం.

‘‘నాకు, కరణ్‌కు మధ్య స్నేహం లేదు. ఆ మాటకొస్తే కరణ్‌కు కాజోల్‌తోనూ ఒకప్పుడున్న అనుబంధం లేదు. దానికి మా మధ్య సినిమాల పోటీ కారణం కాదు. వ్యక్తిగత విషయాలే అందుక్కారణం. ఓ విషయం మనసును బాధించింది. అదేంటన్నది చెప్పలేను’’ అని అజయ్ దేవగణ్ చెప్పాడు. కరణ్ సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’, అజయ్ మూవీ ‘శివాయ్’ ఈ దీపావళికి బాక్సాఫీస్ రేసులో నిలవబోతున్నాయి. ఐతే అజయ్ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటూ కరణ్ తనకు 25 లక్షలు ఇచ్చాడంటూ కమల్ ఆర్.ఖాన్ అనే ఒక కామెడీ క్రిటిక్ ఫోన్లో చెబుతున్న ఆడియోను ఈ మధ్యే అజయ్ రిలీజ్ చేశాడు. దీనిపై పెద్ద వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో అజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కానీ తమ మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి సినిమాలు కారణం కాదని.. ఇంకేదో రీజన్ ఉందని అంటున్నాడు అజయ్. మరి ఆ కారణమేంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు