క‌మెడియ‌న్ పృథ్వీపై 420 కేసు

క‌మెడియ‌న్ పృథ్వీపై 420 కేసు

ప్ర‌స్తుతం తెలుగు సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ క‌మెడియ‌న్ ఎవ‌రంటే మ‌రో మాట లేకుండా పృథ్వీ పేరు చెప్పేయొచ్చు. ద‌శాబ్దాలుగా తెలుగు సినిమాను ఏలుతున్న లెజెండ‌రీ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ప్ర‌భ త‌గ్గుతున్న టైంలో అనూహ్యంగా రైజ్ అయి.. స్టార్ క‌మెడియ‌న్ అయిపోయాడు పృథ్వీ. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఈ టాలెంటెడ్ ఆర్టిస్టు అనుకోకుండా ఓ కాంట్ర‌వ‌ర్శీతో వార్త‌ల్లోకి వ‌చ్చాడు.

పృథ్వీ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు 498 ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఈ వార్త టాలీవుడ్లో ఆదివారం హాట్ టాపిక్ అయింది. ఫిర్యాదు చేసిన మ‌హిళ‌తో పృథ్వీ రాజీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ వివాదం ఎక్క‌డిదాకా వెళ్తుందో.. ఎలా ముగుస్తుందో చూడాలి.

మామూలుగా కొంచెం స్వింగ్‌లో ఉన్న వాళ్ల‌ను దెబ్బ తీయ‌డానికి.. వాళ్ల నుంచి సొమ్ము చేసుకోవ‌డానికి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం మామూలే. అదే స‌మ‌యంలో అనుకోకుండా రైజ్ అయిన వాళ్లు అంత‌కుముందు త‌మ‌తో ఉన్న వాళ్ల‌ను వ‌దిలించుకోవ‌డ‌మూ మామూలే. మ‌రి పృథ్వీ కేసు ఏ పరిధిలోకి వ‌స్తుందో చూడాలి. ఏదేమైనా చేతినిండా మంచి అవ‌కాశాల‌తో మంచి రైజింగ్‌లో ఉన్న పృథ్వీకి ఈ వ్య‌వ‌హారం చికాకు పెట్టేదే. దీన్నుంచి అత‌ను ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు