చౌదరి.. సాయి, కళ్యాణ్ కాంబినేషన్లో

చౌదరి.. సాయి, కళ్యాణ్ కాంబినేషన్లో

నందమూరి-మెగా ఫ్యామిలీ హీరోల మధ్య ప్రత్యక్ష వైరం ఏమీ లేదు కానీ.. ఈ రెండు కుటుంబాల అభిమానులకు మాత్రం ఒకరంటే ఒకరికి పడదని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ల సినిమాలు విడదులైనపుడు వీళ్లు.. వీళ్ల సినిమాలు విడుదలైనపుడు వాళ్లు పరస్పరం చేసుకునే దుష్ప్రచారం.. ముఖ్యంగా సోషల్ మీడియాలో సాగే మాటల యుద్ధాల గురించి ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. అలాంటిది రెండు ఫ్యామిలీకు చెందిన హీరోలు కలిసి సినిమా చేయడం అంటే.. అది ఊహకందని విషయమే. ఐతే గత కొన్నేళ్లలో ట్రెండు మారింది. మల్టీస్టారర్లు పెరిగాయి. ఎవ్వరూ ఊహించని కాంబినేషన్లు తెరమీదికి వస్తున్నాయి.

ఆ కోవలోనే దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి మెగా-నందమూరి కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అటు నందమూరి కథానాయకుడు బాలయ్యతో 'వీరభద్ర'.. ఇటు మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' చేసిన రవికుమార్ చౌదరి.. ఇప్పుడు సాయిధరమ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సినిమా కోసం స్క్రిప్టు వండే పనిలో ఉన్నాడు. గత కొన్ని నెలలుగా ఈ పనిలోనే ఉన్న రవికుమార్.. దాదాపుగా స్క్రిప్టు పూర్తి చేసేశాడు. ఇంకో నెల రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట రవికుమార్. రామకృష్ణ.. అనేది ఆ సినిమా టైటిల్. ఇందులో రామ్ పాత్రలో కళ్యాణ్ రామ్.. కృష్ణ క్యారెక్టర్లో సాయిధరమ్ నటిస్తాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు