తమన్నా ఫ్యాన్స్.. మిస్సవకండి

తమన్నా ఫ్యాన్స్.. మిస్సవకండి

మామూలుగా అయితే తమన్నా సినిమా అంటే ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి హైప్ ఉంటుంది. అందులోనూ ఆమె ప్రభుదేవా పక్కన నటించిందంటే హైప్ ఇంకా ఎక్కువుండాలి. కానీ 'అభినేత్రి' విషయంలో అలాంటి సందడేమీ కనిపించలేదు. దసరాకు ఇటు తెలుగులో.. అటు తమిళంలో పోటీ ఎక్కువగా ఉండటమే కారణం. అందులోనూ తెలుగులో చర్చలన్నీ 'ప్రేమమ్' చుట్టూనే తిరగడం.. మొత్తంగా ఐదు సినిమాలు దసరా బరిలో ఉండటంతో 'అభినేత్రి' మీద ఫోకస్ తక్కువగా నిలిచింది. ఐతే 'అభినేత్రి' తీసి పారేయదగ్గ సినిమా ఏమీ కాదు. యావరేజ్ టాక్ వస్తోంది.

సినిమా ఏ రేంజికి వెళ్తుందన్న సంగతి పక్కనబెడితే.. తమన్నా కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అనడంలో సందేహం లేదు. ఇటు నటనలో అయినా.. అటు గ్లామర్ పరంగా అయినా తమన్నా అదరగొట్టేసింది. తమన్నా ఫ్యాన్స్ కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. కెరీర్లో తమ్మూ ఇప్పటిదాకా గ్లామర్ రోల్స్ చాలా చేసింది. ఐతే వాటన్నింటికంటే ఇందులో హాట్ హాట్గా కనిపించింది. ఆమెను చూడ్డానికి కుర్రాళ్లకు రెండు కళ్లూ చాలవు. అంత సెక్సీగా ఉంటుంది మిల్కీ బ్యూటీ. మరోవైపు తమన్నా నటనతోనూ మంచి మార్కులేయించుకుంది. రెండు వేరియేషన్లున్న పాత్రలో చక్కటి అభినయం ప్రదర్శించింది. మొత్తంగా తమన్నా కోసమైనా 'అభినేత్రి' చూడొచ్చు అనిపించింది. కాబట్టి తమ్మూ ఫ్యాన్స్ ఈ సినిమాను అస్సలు మిస్సవడానికి వీల్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు