జాగ్వార్.. ఏక్ దిన్ కా సుల్తాన్

జాగ్వార్.. ఏక్ దిన్ కా సుల్తాన్

త‌మ‌న్నా-ప్ర‌భుదేవా జంట‌గా న‌టించిన ‘అభినేత్రి’ సినిమాకు శుక్ర‌వారం.. తొలి రోజు హైద‌రాబాద్ మొత్తం 40 షోలు కూడా లేవు. ప్ర‌కాష్ రాజ్ సినిమా ‘మ‌న‌వూరి రామాయ‌ణం’ ప‌రిస్థితి మ‌రింత దారుణం. ఆ సినిమాకు తొలి రోజు ఓ 30 షోలు మాత్ర‌మే ప‌డుతున్నాయి హైద‌రాబాద్‌లో. కానీ గురువారం క‌న్న‌డ కుర్రాడు నిఖిల్ కుమార్ సినిమా ‘జాగ్వార్’ మాత్రం పెద్ద స్థాయిలో రిలీజైంది. మ‌న ద‌గ్గ‌ర మీడియం రేంజి హీరో సినిమా స్థాయిలో విడుద‌లైంది ఈ చిత్రం. తొలి రోజు 30 పైగా స్క్రీన్లలో దాదాపు 80 షోలు ప‌డ్డాయి. హైద‌రాబాద్ అనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి.

టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ గురువారం పోటీ లేక‌పోవ‌డంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగానే వ‌చ్చాయి. ఐతే ‘జాగ్వార్’ సంద‌డి ఒక్క రోజుకే పరిమితం కాబోతోంది. శుక్ర‌వారం నాలుగు సినిమాలు రిలీజ‌వుతుండ‌టంతో స్క్రీన్లు త‌గ్గిపోతున్నాయి. అలాగే జ‌నాలు కూడా ఈ సినిమాను ప‌ట్టించుకునే అవ‌కాశం లేదు. అస‌లే మ‌న హీరో కాదు. పైగా సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చింది. ఆ నాలుగు సినిమాల్లో ఏది చూడాల‌ని తేల్చుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉంటే ఇక ‘జాగ్వార్‌’ను ఎక్క‌డ పట్టించుకుంటారు. కాబ‌ట్టి ‘జాగ్వార్’ ఏక్ దిన్ కా సుల్తాన్ కాబోతున్నాడ‌న్న‌మాటే. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించిన ఈ సినిమాకు మిత్రుడు ఫేమ్ మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English