సుక్కు తీయబోయేది సెన్సేషనే..

సుక్కు తీయబోయేది సెన్సేషనే..

సుకుమార్ అనగానే అల్ట్రా మోడర్న్ సినిమాలే గుర్తుకొస్తాయి. ‘ఆర్య’ లాంటి కాలేజ్ లవ్ స్టోరీతో మొదలుపెట్టి మొన్నటి ‘నాన్నకు ప్రేమతో’ వరకు అర్బన్ స్టోరీలే చేశాడు సుక్కు. ఇంతకుముందైనా లోకల్ కథలు చేసేవాడు కానీ.. ఈ మధ్య మాత్రం ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమాలు చేస్తున్నాడు. ‘1 నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు రెండూ కూడా చాలా వరకు ఫారిన్లోనే సాగుతాయి. మరి అలాంటి దర్శకుడు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తాడంటే నమ్మగలమా? సుక్కు సినిమా మొత్తం పల్లెటూరిలోనే సాగితే ఎలా ఉంటుందో ఊహించగలమా..? కానీ ఇప్పుడు ఇదే జరగబోతోంది.

రామ్ చరణ్ హీరోగా సుక్కు తీయబోయే సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుందట. ఇంతకుముందు ఇదో సైఫై థ్రిల్లర్ అని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. స్వయంగా సుక్కునే రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా మొత్తం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుందని స్పష్టం చేశాడు. సుక్కు లాంటి స్టైలిష్  రామ్ చరణ్ లాంటి మోడర్న్ హీరోను పెట్టి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే అది కచ్చితంగా సెన్సేషనే అవుతుంది. ఇద్దరికీ ఎంతో వైవిధ్యమైన సినిమా అవుతుంది. అసలు టాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీలూ ఇప్పుడు విలేజ్ స్టోరీలకు టాటా చెప్పేశాయి. ప్రస్తుత కథలన్నీ సిటీల్లోనే సాగుతున్నాయి. ఇంకా మించితే ఫారిన్ వెళ్తున్నారు. అలాంటిది విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫుల్ మూవీ తీయడం అంటే ఆశ్చర్యమే. మరి సుక్కు ఏం తీస్తాడో.. ఎలా తీస్తాడో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు