ఈ సినిమా తేడా వచ్చిందో..

ఈ సినిమా తేడా వచ్చిందో..

సునీల్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కమెడియన్ వేషాలకు పూర్తిగా చెల్లు చీటీ ఇచ్చేసి కొన్నేళ్లుగా హీరోగానే కంటిన్యూ అవుతున్నాడు. కానీ ‘పూల రంగడు’ తర్వాత అతడి కెరీర్లో హిట్టే లేదు. మిస్టర్ పెళ్లికొడుకు.. భీమవరం బుల్లోడు.. కృష్ణాష్టమి.. జక్కన్న.. ఒకదాన్ని మించి ఇంకోటి ఫ్లాపయ్యాయి. కేవలం ఫ్లాప్ అవ్వడమే కాదు.. ఈ సినిమాలు సునీల్ మీద తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి. తన ఇమేజ్ కు నప్పని వేషాలేస్తున్నాడంటూ జనాలు తిట్టుకున్నారు ఈ సినిమాలు చూసి. ఈ నేపథ్యంలో సునీల్ కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా. ఇది కూడా పోతే సునీల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బిందాస్.. రగడ.. దూసుకెళ్తా లాంటి మినిమం గ్యారెంటీ సినిమాలు అందించిన వీరూ పోట్ల దర్శకత్వం వహించిన సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’. ట్రైలర్ చూస్తే అతడి మార్కు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది. కాకపోతే దసరాకు మరో నాలుగు సినిమాలతో పోటీ పడటం ప్రతికూలంగా మారింది. అందువల్లే దీనిపై ఆశించినంత బజ్ లేదు. ఈ నేపథ్యంలో సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. జనాలు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకంటారన్నది కీలకం. ఐతే ‘ఈడు గోల్డ్ ఎహే’కు ఉన్న పాజిటివ్ ఏంటంటే.. దసరాకు రేసులో ఉన్న వాటిలో మాస్ ను ఆకర్షిస్తున్న ఏకైక సినిమా ఇదే. ఆ వర్గం ప్రేక్షకులు ఈ సినిమా మీద బాగానే ఆసక్తి చూపించవచ్చు. ఓపెనింగ్స్ బాగానే ఉండొచ్చు. ఐతే సునీల్ గత రెండు సినిమాలకు కూడా ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. తర్వాతే సినిమా నిలబడలేదు. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

ActressMore »

  • Shilpi Sharma Latest StillsShilpi Sharma Latest Stills
  • Sushma Raj Latest StillsSushma Raj Latest Stills
  • Rasi Khanna Shines In BlackRasi Khanna Shines In Black
  • Richa Panai Latest StillsRicha Panai Latest Stills
  • Premam Heroine Anupama ParameshwaranPremam Heroine Anupama Parameshwaran
  • Vaibhavi Joshi Spicy StillsVaibhavi Joshi Spicy Stills

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు