'తుఫాన్‌' దాదాపు ముగిసినట్లే

'తుఫాన్‌' దాదాపు ముగిసినట్లే

రాష్ట్రంను వణికిస్తున్న మాహాసేన్‌ తుఫాన్‌ ఇంకా తీరందాటలేదు కాని, దేశాన్ని షేక్‌ చేద్దామని తయారువుతున్న రామ్‌ చరణ్‌ తుఫాన్‌ మాత్రం దాదాపు ముగిసిపోయింది. అవును, బాలీవుడ్‌లో చరణ్‌ ఆరంగేట్రపు ఫిలింగా పాపులరైన జంజీర్‌ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది.

ఇప్పటికే సంజయ్‌ దత్‌కు చెందిన పార్ట్‌ను కూడా డబ్బింగ్‌ చేసేశారు. ఆఖరి రోజు షూటింగులో చరణ్‌, ప్రియాంక, సంజయ్‌, శ్రీహరిలు పాల్గొన్నారట. అంటే సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తయితే, ఇంకా రిలీజ్‌ ఒక్కటే లేటన్నమాట. కాని తుఫాన్‌లోని గ్రాఫిక్స్‌, సౌండ్‌ మిక్సింగ్‌ వగైరా పనులు పూర్తవ్వడానికి దాదాపు రెండు నెలలు పడుతుందని తెలుస్తోంది. అయితే చరణ్‌ ఫ్యాన్స్‌కు ఈ న్యూస్‌ కొంచెం అప్సెట్‌గా అనిపించవచ్చు కాని, జంజీర్‌ సినిమా తెలుగు వర్షెన్‌ మాత్రం ఖచ్చితంగా రెండు నెలల తరువాత రిలీజవుతుందని సన్నిహిత వర్గాలు తెలియజేసాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి కోర్టు కేసులన్నీ క్లియర్‌కాగా, మరో రెండు చిన్నవి ఏవో సెటిల్‌మెంట్‌ దిశగా నడుస్తున్నాయట. ముగిసిన తుఫాన్‌, ప్రేక్షకుల మందుకు ఎప్పుడు వస్తుందో మరి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English