మూడోసారి కూడానా.. నితిన్

మూడోసారి కూడానా.. నితిన్

వరుసగా రెండు హిట్లు కొట్టడంతో కొత్తగా ఏం చేయాలి అనేది ఆలోచించడమానేసి, యంగ్‌ హీరో నితిన్‌ మాత్రం ఏ సెంటిమెంట్‌ను ఎలా రిపీట్‌ చెయ్యాలి అనే దానిమీద ఫోకస్‌ చేస్తున్నాడు. మొదటిగా మనోడు పవర్‌స్టార్‌ను ఏదో విధంగా వాడేసుకుంటాడనేది తెలిసిందే. కాని బోరింగ్‌ మ్యాటర్‌ ఏంటంటే మూడోసారి మళ్ళీ పొట్టి సుందరి నిత్యా మీనన్‌తో జతకడతాడట. 

ఇష్క్‌, గుండెజారి సినిమాల్లో నిత్య వలనే మ్యాజిక్‌ వర్కవుటయ్యిందని ఫీలయ్యి, త్వరలో రాబోయే కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ సినిమాలో ఆమెనే తీసుకోవాలని నితిన్‌ పట్టుబడుతున్నాడట. ఇప్పటికే ఈ చిత్రంలో యామి గౌతమ్‌ను హీరోయిన్‌గా పెట్టి కొన్ని సీన్లు షూటింగ్‌ కూడా చేశారు. మరి ప్రొడ్యూసర్‌ గౌతమ్‌ మీనన్‌ ఇప్పుడు ఆమెను తీసేసి నితిన్‌కు మూడోసారి నిత్యామీనన్‌తో చేసే ఛాన్స్‌ ఇస్తాడా. అయినా పైత్యం కాకపోతే ముచ్చటగా మూడోసారంటే ప్రేక్షకులకు బోర్‌ కొట్టదా నితిన్‌ బాబు...

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు