సునీల్ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడ‌ట‌

సునీల్ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడ‌ట‌

క‌మెడియ‌న్‌గా స్టార్ స్టేట‌స్ సంపాదించాక హీరో అయ్యాడు సునీల్. ఇప్పుడు అత‌డి దృష్టి విల‌న్ పాత్ర‌ల మీదికి మ‌ళ్లుతోంది. వ‌చ్చే ఏడాది తాను విల‌న్ అవ‌తార‌మెత్త‌నున్న‌ట్లు తెలిపాడు సునీల్. ఐతే సునీల్ విల‌న్‌గా క‌నిపించేది తెలుగులో మాత్రం కాద‌ట‌.

‘‘నేను విల‌న్ అవుదామ‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. మోహ‌న్ బాబు గారు.. కోట శ్రీనివాస‌రావు గార్ల‌లాగా విల‌న్ పాత్ర‌లు చేయాలి అనుకున్నాను. కానీ కుద‌ర‌లేదు.  ఐతే వ‌చ్చే సంవ‌త్స‌రం విల‌న్‌గా న‌టిస్తాను. ఐతే అది తెలుగు సినిమాలో మాత్రం కాదు. వేరే భాష‌లో విల‌న్ పాత్ర చేయ‌బోతున్నాను. తెలుగులో విల‌న్‌గా చేస్తే మ‌న ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేయ‌రు. నాకు కామెడీ ఇమేజ్ ఉంది కాబ‌ట్టి విల‌న్ పాత్ చేస్తే చూడ‌క‌పోవ‌చ్చు. అందుక‌నే వేరే భాష‌లో విల‌న్‌గా న‌టించాల‌నుకుంటున్నా’’ అని సునీల్ తెలిపాడు.

 ఇక క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. హీరోగా మార‌క వ‌చ్చిన తేడా గురించి సునీల్ చెబుతూ.. ‘‘నేను యాక్టింగ్ చేస్తున్నా. హీరో అనే పేరు త‌ప్పితే పెద్ద‌గా తేడా ఏమీ లేదు. క‌మెడియ‌న్‌గా  రోజూ 5 సినిమాలు చేసేవాడిని. హీరోగా ఏడాదికి నాలుగు సినిమాలు చేయాలనుకుంటున్నా. హీరో అయ్యాక ఖాళీ దొరుకుతోంది. నా కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నా. వాళ్లు చాలా హ్యాపీ’’ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు