బాహుబలి కోసం ఎలా తయారయ్యాడో చూడండి

బాహుబలి కోసం ఎలా తయారయ్యాడో చూడండి

రానా దగ్గుబాటి కమిట్మెంట్ గురించి.. అతడి కష్టం గురించి ఈ ఫొటోనే చెప్పేస్తుంది. మనం ఇంకేమీ మాట్లాడ్డానికేమీ లేదు. తెలుగు హీరోలకే కాదు.. బాలీవుడ్ వాళ్లకు కూడా సవాల్ విసురుస్తున్నాడు మన కండల వీరుడు. ‘బాహుబలి’ తొలి భాగంతో పోలిస్తే రెండో భాగం మీద అంచనాలు మరింత ఎక్కువగా ఉండటం.. తన విలనీ కోసం జనాలు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో రానా మరింతగా కష్టపడుతున్నాడు.

కొన్ని నెలలుగా ఓవైపు జిమ్‌లో గంటలు గంటలు కష్టపడుతూనే.. మరోవైపు షూటింగులో పాల్గొంటూ వస్తున్న రానా.. ఇప్పుడు మరింత దృఢంగా తయారయ్యాడు. బాలీవుడ్లో జాన్ అబ్రహాం లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమైన స్థాయిలో బాడీ పెంచాడు. బాహుబలి కోసం ఎలా తయారయ్యానో చూడండంటూ ఈ రోజు ట్విట్టర్లో ఈ ఫొటో షేర్ చేశాడు. ఆ కండలు.. ఆ గడ్డం చూస్తుంటే.. రెండో భాగంలో భల్లాలదేవుడి పాత్ర మరింత ఇంటెన్సిటీతో ఉంటుందని అర్థమవుతోంది.

ఐతే ఇప్పటికే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయిపోయిందని చెబుతున్నా..  రానా ఈ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆపకపోవడం.. ఇంకా కష్టపడి మరింతగా బాడీ పెంచుతుండటమే ఆశ్చర్యం. అంటే వార్ ఎపిసోడ్ కాకుండా ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు మిగిలే ఉన్నాయన్నమాట. ఐతే ఏం మిగిలి ఉన్నా.. ఇంకో రెండు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడు రాజమౌళి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు