చైతూ కోసం ప‌దిమంది నిర్మాత‌లొచ్చార‌ట‌

చైతూ కోసం ప‌దిమంది నిర్మాత‌లొచ్చార‌ట‌

‘కార్తికేయ’ లాంటి సెన్సేష‌న‌ల్ హిట్‌తో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు యువ ద‌ర్శ‌కుడు చందూ మొండేటి. అలాంటి సినిమాతో వ‌చ్చిన‌వాడు.. రెండో సినిమాగా రీమేక్‌ను ఎంచుకోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఐతే ముందు తాను కూడా రీమేక్ విష‌యంలో అంత ఆస‌క్తిగా లేన‌ని చెప్పాడు చందూ. అస‌లు ‘ప్రేమ‌మ్’ రీమేక్ ఎలా మొద‌లైందో.. తెలుగు వెర్ష‌న్ విష‌యంలో తానేం మార్పులు చేశానో ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు చందూ. అత‌నేమ‌న్నాడంటే..

‘‘నేను, నాగ‌చైత‌న్య వేర్వేరుగా ‘ప్రేమ‌మ్’ సినిమా చూశాం. ఇద్ద‌రికీ బాగా న‌చ్చింది. మా నిర్మాత ఈ సినిమాను ఇష్ట‌ప‌డ్డాడు. కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే దాదాపు ప‌ది మంది నిర్మాత‌లు ‘ప్రేమ‌మ్’ రీమేక్ కోసం చైతూను సంప్ర‌దించారు. అప్పుడే ఈ రీమేక్‌ను కొంచెం సీరియ‌స్‌గా తీసుకున్నాం. నేను రీమేక్ సినిమా చేయాలా అనే కొంచెం సందేహంలో ఉన్న‌ప్ప‌టికీ స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లుపెట్టాక అవ‌న్నీ తొల‌గిపోయాయి.

‘ప్రేమ‌మ్’ ఒరిజిన‌ల్‌లో చాలా మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల రెఫ‌రెన్సులుంటాయి. ఆ సినిమా అక్క‌డి నేటివిటీతో సాగుతుంది. కాబ‌ట్టి నేను స్క్రిప్టు మొత్తాన్ని రీరైట్ చేయాల్సి వ‌చ్చింది. మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేయాల్సి వ‌చ్చింది. స్క్రిప్ట్ వ‌ర్క్ మొద‌లుపెట్టిన ప‌ది రోజుల‌కు.. కొన్ని సీన్లు రీరైట్ చేశాక నా చేతిలో మంచి స్క్రిప్ట్ ఉంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. మ‌ల‌యాళ వెర్ష‌న్‌తో పోల్చకుండా చూస్తే ‘ప్రేమ‌మ్’ ఒక మంచి ఎంట‌ర్టైన‌ర్’’ అని చందూ మొండేటి కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు