శ్రీదేవి కూతురి ఎంట్రీ మూవీ ఇదే..

 శ్రీదేవి కూతురి ఎంట్రీ మూవీ ఇదే..

అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్న‌వి తెరంగేట్రం గురించి రెండేళ్ల ముందు నుంచి చ‌ర్చ న‌డుస్తోంది. ఆమె పేరును ముడిపెడుతూ చాలా కాంబినేష‌న్లు.. చాలా సినిమాల పేర్లు వినిపించాయి. ఐతే అవేవీ కార్య‌రూపం దాల్చ‌లేదు. ఐతే ఎట్ట‌కేల‌కు జాహ్న‌వి తెరంగేట్రం చేయ‌బోయే సినిమా ఖాయ‌మైన‌ట్లు స‌మాచారం.

ప్రముఖ ద‌ర్శ‌కుడు డేవిడ్ ధావ‌న్ కొడుకైన యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కాబోతోంద‌ట జాహ్న‌వి. ఆమె తొలి సినిమా పేరు.. ‘సిద్ధత్‌’. ‘2 స్టేట్స్’ లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అభిషేర్ వ‌ర్మ‌న్ ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నాడు. క‌ర‌ణ్ జోహార్.. సాజిద్ న‌డియాడ్ వాలా లాంటి బ‌డా నిర్మాత‌లిద్ద‌రూ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ట‌. ఈ సినిమా వ‌చ్చే ఏడాది మ‌ధ్య‌లో సెట్స్ మీదికి వెళ్తుంద‌ట‌. ఈ సినిమా స్క్రిప్టు మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నార‌ట‌. ఇందుకోసం చాలా స‌మ‌యమే వెచ్చిస్తున్నారు.

‘సిద్ధ‌త్’ సినిమా గురించి ఇంత‌కుముందే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అప్పుడు ఇందులో వ‌రుణ్ స‌ర‌స‌న ఆలియా భ‌ట్‌ను హీరోయిన్‌గా చెప్పుకున్నారు. ఐతే ఈ స్క్రిప్టు గురించి తెలుసుకుని.. త‌మ కూతురి అరంగేట్రానికి బాగుంటుంద‌ని బోనీ కపూర్, శ్రీదేవి క‌ర‌ణ్ జోహార్‌ను అప్రోచ్ అయ్యార‌ట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఒక‌ప్ప‌టి అందాల తార మాధురీ దీక్షిత్ నటించ‌బోతుండ‌టం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English