ముహూర్తబలం చూస్తున్న ష‌ర్మిల‌

ష‌ర్మిల ముహూర్త‌బ‌లం కోసం చాలా సీరియ‌స్ గా ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణాలోని వైఎస్సార్ అభిమానులు, మ‌ద్ద‌తుదారుల‌తో భేటీలు నిర్వ‌హిస్తున్న ష‌ర్మిల‌కు చాలామంది చాలా సూచ‌న‌లు చేస్తున్నార‌ట‌. అంతిమంగా ఎవ‌రు ఏమి చెబుతున్నా పార్టీ ప్ర‌క‌ట‌న‌కు ముందుగానే కీల‌క‌మైన నేత‌ల‌ను త‌నతో క‌లిసి న‌డిచేందుకు చేయి కల‌పాల్సిందిగా కోరుతున్న‌ట్లు స‌మాచారం.

ప‌నిలో ప‌నిగా పార్టీ ప్ర‌క‌ట‌న‌కు మంచి ముహూర్త‌బ‌లాన్ని చూస్తున్న‌ట్లు చెబుతున్నారు. ముందు పాద‌యాత్ర చేయాలా ? లేక‌పోతే పార్టీని ప్ర‌క‌టించాలా అన్న విష‌యంలోనే ష‌ర్మిల కాస్త క‌న్ఫ్యూజ‌న్ గా ఉన్న‌ట్లు స‌మాచారం. పార్టీ ప్ర‌క‌ట‌న‌కైనా పాద‌యాత్ర‌కైనా రెండు ముహూర్తాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జూలై 8వ తేదీ, మే 14వ తేదీల‌ను సీరియ‌స్ గా ప‌రిశీలిస్తున్నార‌ట‌.

మే 14వ తేదీకి ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఆరోజున వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా మొద‌టిసారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఇక రెండో ముహూర్తం జూలై 8వ తేదీ ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఆరోజు వైఎస్సార్ జ‌యంతి. జ‌యంతి రోజే పార్టీ పేరును ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని ష‌ర్మిల అనుకుంటున్నార‌ట‌. అయితే అప్ప‌టికి చాలా ఆల‌స్య‌మైపోతుంద‌ని కీల‌క నేత‌లు చెబుతున్నార‌ట‌. మే 14వ తేదీన అయితే మొద‌టిసారి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన తేదీనే పార్టీ ప్ర‌క‌ట‌న చేసినా లేక‌పోతే పాద‌యాత్ర ప్రారంభిస్తే బాగుంటుంద‌ని చెబుతున్నార‌ట‌.

పై రెండు తేదీల్లో దేనివైపు మొగ్గు చూపుతారో ఎవ‌రికీ తెలీటం లేదు. ఎందుకంటే ష‌ర్మిల అనుకున్న జూలై 8వ తేదీ విష‌యంలో నేత‌ల్లో కొంద‌రి మ‌ధ్య చిన్న‌పాటి అభ్యంత‌రాలున్న‌ట్లు స‌మాచారం. కాబ‌ట్టి ఏ విష‌యం ఇంకా పూర్తిగా తేల‌లేదు. మొత్తం మీద పై రెండు తేదీల‌నే ష‌ర్మిల సీరియ‌స్ గా ఆలోచిస్తున్న‌ట్లు ఆమె స‌న్నిహిత‌వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.