అభద్రతలో విరాట్?

అభద్రతలో విరాట్?

విరాట్ కోహ్లి.. గ్రౌండ్‌లో ఉంటే విశ్వరూపం చూపిస్తాడు. కాన్ఫిడెంట్‌గా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. సునాయాసంగా పరుగులు రాబడుతూ భారత క్రికెట్ జట్టుకు విజయాలు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అదే విరాట్ వ్యక్తిగత జీవితంగా అభద్రతకు గురవుతున్నాడా? ఈ ఫీలింగ్స్‌తోనే ప్రేయసి అనుష్కను దూరం చేసుకుంటున్నాడా? అవుననే అంటున్నారు బీటౌన్ జనాలు. ప్రేమపక్షలు 'విరుష్క'ల మధ్య అంతా సవ్యంగా లేదని ఓసారి విడిపోయి మళ్లీ కలుసుకున్నా పాత గొడవలు రిపీట్ అవుతున్నాయని చెప్తున్నారు.

అనుష్క పట్ల విరాట్ పొజెసివ్ వైఖరి చూపిస్తున్నాడట. ఓ అమ్మాయి తనది అనుకుంటే ఏ ప్రేమికుడైనా చూపించే లక్షణమే అది. కానీ విరాట్ విషయంలో ఇది శృతి మించిపోయిందట. అనుష్క పని షెడ్యూల్ ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం నచ్చడంలేదట. ఇక వేళాపాళా లేకుండా ఆమెకు ఫోన్స్‌ కూడా చేస్తూ ఎక్కడున్నావంటూ ఆరా తీస్తున్నాడట. అతడి వైఖరితో ఈ 'సుల్తాన్' స్టార్ విసుగెత్తిపోతోందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

విరాట్ బిజీ షెడ్యూల్‌లోనూ తీరిక చేసుకుని 'ద రింగ్' షూటింగ్ నిమిత్తం ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న అనుష్కను కలుసుకున్నాడు. వీరిద్దరూ కలిసి అక్కడి వీధుల్లో చక్కర్లు కొట్టారు. కిక్రెట్‌ టూర్‌లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఉన్నపాటున అతడు అనుష్కను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రేయసిని కోల్పోతానన్న భయం అతడినికి వెన్నాడుతోందని బాలీవుడ్ టాక్. వీరిద్దరూ విడిపోయే ట్రాక్‌లో ఉన్నారని ముంబై మీడియా కోడై కూస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు