అభిమాని సెల్ఫీ పిచ్చికి చెంప దెబ్బతో బదులు!

అభిమాని సెల్ఫీ పిచ్చికి చెంప దెబ్బతో బదులు!

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహామ్‌ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోడని అంటారు. భావోద్వేగాలు అదుపులో పెట్టుకుని విసిగించినా సహించుకుంటాడని చెప్తారు బీటౌన్ జనాలు. కానీ తాజాగా ఈ 'డిష్యూం' స్టార్ ఓ అభిమానిపై చేయి చేసుకున్నాడన్న వార్తలు గుప్పుమన్నాయి. గురువారం 'ఫోర్స్-2' ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌ ముగిసిన జాన్ అక్కణ్ణుంచి కదిలాడు. ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసరికి అభిమానులు ఒక్కసారిగా అతడి వద్దకు పరుగెత్తుకొచ్చారు. వారిని తప్పించుకుంటూ బయటకు వెళ్లపోతున్న జాన్‌ను ఓ అభిమాని హీరోగారి చెయ్యిపట్టి లాగి సెల్ఫీ తీసుకోబోయాడట. దీంతో ఒళ్లు మండిన జాన్ అతడిని చెంప దెబ్బ కొట్టడమే కాక ఈ సంఘటనను ప్రచురించవద్దని అక్కడున్న మీడియాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడట.

ఇంత కథ జరిగితే మీడియా ఎలాగూ ఊరుకోదు. నిన్నటి నుంచి ఇదే ఇష్యూపై పలు వార్తలు వెలువడ్డాయి. ఈ న్యూస్‌ను జాన్ తీవ్రంగా ఖండించాడు. జాన్ తరపు ప్రతినిథులు తెరపైకి వచ్చి తమ హీరో ఎవ్వరిపైనా చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. జాన్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఫ్యాన్ ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు కోరాడని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు