రాశి ఖన్నా.. ఇదేం ఊపు బాబోయ్

రాశి ఖన్నా.. ఇదేం ఊపు బాబోయ్

రాశి ఖన్నా నక్క తోక తొక్కినట్లే ఉంది. ఉన్నట్లుండి ఆమె కెరీర్ మాంచి రైజింగ్‌కు వచ్చేస్తోంది. ఓవైపు తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు ఒక్కొక్కటే సొంతమవుతుంటే.. మరోవైపు కోలీవుడ్ కూడా ఆమెను రారమ్మని పిలుస్తోంది. కొన్ని రోజుల కిందటే రాశి తన తొలి తమిళ ప్రాజెక్టు సైన్ చేసిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ క్రిష్ అనే దర్శకుడు రూపొందించే ఆ సినిమా పేరు.. సైతాన్ కా బచ్చా.

ఈ వార్త బయటికి వచ్చిన కొన్ని రోజులకే రాశి రెండో తమిళ సినిమా కూడా ఓకే చేసింది. తెలుగులోకి అనువాదమైన హార్రర్ మూవీ ‘డిమాంటి కాలనీ’కి దర్శకత్వం వహించిన అజయ్ జ్నానముత్తు దర్శకత్వంలో అధర్వ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు రాశి కథానాయికగా ఎంపికైంది. గత ఏడాది రాశి కెరీర్ ఏమంత ఊపులో లేదు. కానీ ‘బెంగాల్ టైగర్’లో అందాలు ఆరబోశాక ఆమె ఫేట్ మారింది.

రాశిలోని గ్లామర్ కోణం వరుసగా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది ‘సుప్రీమ్’తో మాంచి హిట్టు ఖాతాలో వేసుకున్న రాశి... తాజాగా ‘హైపర్’తో ప్రేక్షకుల్ని పలకరిస్తోంది. మాస్ రాజా రవితేజతో ‘బెంగాల్ టైగర్’ తర్వాత మరోసారి జత కట్టబోతున్న రాశికి.. ఇంకో రెండు మూడు క్రేజీ ప్రాజెక్టుల్లోనూ చోటు దక్కేలా ఉంది. చూస్తుంటే మున్ముందు రాశి ఖన్నా రేంజే మారిపోయేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు