కరీనా కపూర్‌ ఓ సెల్ఫీ రాణి

కరీనా కపూర్‌ ఓ సెల్ఫీ రాణి

ట్రెండ్స్‌ వస్తుంటాయి. పోతుంటాయి. కానీ సెల్ఫీ ట్రెండ్‌ మాత్రం రోజు రోజుకీ ముదిరిపోయింది. ఈ ధోరణి జిడ్డులా అంటుకోవడం.. దాన్ని వదిలించుకునేందుకు జనాలకూ ఆసక్తి లేకపోవడంతో ఎక్కడున్నా సరే సెల్ఫీ క్లిక్‌ల సౌండ్‌ వినిపిస్తోంది. సెల్ఫీలేంటే పడి చచ్చేవారిలో మన బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌కు ఫస్ట్‌ ప్లేస్‌ కట్టబెట్టేయొచ్చు. ఎందుకంటే తనను తాను ఆమె 'సెల్ఫీ క్వీన్‌'గా పేర్కొంది. ప్రతీ ఐదు నిమిషాలకో సారి సెల్ఫీ తీసుకుంటే గానీ ఆమెకు మనశ్శాంతి ఉండదట.

'వోగ్‌ బీఎఫ్‌ఎఫ్స్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ''నేనో సెల్ఫీ క్వీన్‌ని. ఎల్లప్పుడూ నన్ను నేను ఫొటోలు తీసుకుంటూనే ఉంటా. ప్రతీ 5-10 నిమిషాలకో సారి ఇది జరిగిపోతుంటుంది'' అని చెప్పుకొచ్చింది కరీనా. తన కెరీర్‌ గురించీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. లైఫ్‌ను ముందుగానే ప్లాన్‌ చేసుకోలేదట ఈ 'కీ&కా' స్టార్‌. తన మనసు చెప్పిందే చేసిందట. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ నటిగా గుర్తింపు తెచ్చుకున్న కరీనా డిసెంబర్‌లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం ఆమె 'వీర్‌ డి వెడ్డింగ్‌' చిత్రంలో నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు