అద్గదీ పెళ్లిచూపులు లెక్క

అద్గదీ పెళ్లిచూపులు లెక్క

ఈ ఏడాది తెలుగులో అతి పెద్ద సర్‌ప్రైజ్ అంటే.. ‘పెళ్లిచూపులు’ సినిమానే. పెద్దగా పేరు లేని హీరో హీరోయిన్లు.. మిగతా నటీనటులందరూ కొత్త వాళ్లే. దర్శకుడూ కొత్తవాడే. మిగతా టెక్నీషియన్లకూ అనుభవం లేదు. పోనీ ఈ సినిమా తీసింది ఏదైనా పెద్ద సంస్థా అంటే అదీ కాదు. కానీ వీళ్లందరూ కలిసి కంటెంట్‌ను నమ్ముకుని ట్రావెల్ చేశారు. విడుదలకు ముందు సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత అండ దొరకడం ప్లస్ అయింది. సినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ బజ్ వచ్చింది. రిలీజ్ తర్వాత ఈ సినిమా అంచనాల్ని మించి ఎక్కడికో వెళ్లిపోయింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.

కేవలం కోటిన్నర బడ్జెట్లో తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ ఫుల్ రన్లో రూ.25 కోట్ల గ్రాస్.. రూ.17.1 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. తెలంగాణలో రూ.6.25 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ‘పెళ్లిచూపులు’ ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలన్నీ కలిపి రూ.4.25 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.5 కోట్ల షేర్ వసూలైంది. అమెరికాలో ఈ సినిమా 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. షేర్ రూ.5.3 కోట్లు వచ్చింది. మిగతా ఏరియాలన్నీ కలిపితే రూ.1.3 కోట్ల షేర్ వసూలైంది. అలా మొత్తం లెక్క రూ.17 కోట్లు దాటింది. అమెరికాలో ఇప్పటిదాకా విడుదలైన పెద్ద సినిమాల్లో ‘పెళ్లిచూపులు’ స్థానం 17 కావడం విశేషం. థియేట్రికల్ వసూళ్లకు.. ఇంకా శాటిలైట్.. రీమేక్.. హక్కుల ద్వారా వచ్చిన ఆదాయం కూడా కలపాల్సి ఉంది. అవి ఓ ఆరేడు కోట్లయినా ఉంటాయి. దీన్ని బట్టే ‘పెళ్లి చూపులు’ ఏ రేంజి హిట్టో అర్థం చేసుకోవచ్చు.

ActressMore »

  • Hansika Latest PhotosHansika Latest Photos
  • Uttej Daughter Chetana Latest PhotosUttej Daughter Chetana Latest Photos
  • Bollywood Heroines At GQ AwardsBollywood Heroines At GQ Awards
  • Nithya PhotosNithya Photos

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు