నరేష్ కొడుకు అంత పెద్ద ఎడిటరా?

నరేష్ కొడుకు అంత పెద్ద ఎడిటరా?

తెలుగు తెరపైకి మరో వారసుడు వచ్చేస్తున్నాడు. సీనియర్ నటుడు నరష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ‘నందిని నర్సింగ్ హోం’తో హీరోగా పరిచయం కాబోతున్నాడు. దీని టీజర్.. ట్రైలర్ అవీ బాగానే అనిపిస్తున్నాయి. నవీన్‌ నటనలో ఈజ్ కనిపిస్తోంది. తొలి సినిమా బిడియం ఏమీ కనిపించట్లేదు. ఐతే అతడిలో తడబాటు లేకపోవడానికి ఇప్పటికే సినీ రంగంలో పని చేయడమే కారణం. అతను ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్లో పని చేశాడన్న సంగతి తెలిసిందే కానీ.. అతడి టాలెంట్ గురించి త్రివిక్రమ్, మహేష్ బాబు లాంటి వాళ్లు చెప్పిన మాటలే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

త్రివిక్రమ్ ఏకంగా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్స్ అంటూ నవీన్‌కు కితాబిచ్చేశాడు. నవీన్‌తో తనకు ‘అతడు’ సినిమా దగ్గర్నుంచి పరిచయం ఉందని.. అప్పట్లో ఫిలిం ఫేర్ అవార్డులకు తన సినిమాకు సంబంధించిన ఏవీ అడిగితే.. నవీనే ఎడిట్ చేసి ఇచ్చాడని వెల్లడించాడు త్రివిక్రమ్. నవీన్ ఎడిటింగ్ నుంచి వెళ్లిపోతే బాధగా ఉంటుందని అంటూనే.. అతను నటుడిగా సక్సెస్ కావాలని ఆకాంక్షించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత మహేష్ బాబు మాట్లాడుతూ.. నవీన్ ఎక్స్‌ట్రార్డినరీ ఎడిటర్ అని చెప్పాడు. చిన్నతనంలోనే తన ఎడిటింగ్ టాలెంట్ చూపించాడని.. అతడు, పోకిరి లాంటి సినిమాలకు అతడి సహకారం తీసుకున్నామని వెల్లడించాడు. ఏదైనా పాట.. ఫైట్ కొత్తగా కావాలంటే నవీన్ దగ్గరికే వెళ్లేవాళ్లమని మహేష్ చెప్పడం విశేషం. టాలీవుడ్లో వారసులు టెక్నీషియన్‌గా ఇంత పేరు తెచ్చుకోవడం.. ఇలాంటి కితాబులు అందుకోవడం విశేషమే.

ActressMore »

  • Hansika Latest PhotosHansika Latest Photos
  • Uttej Daughter Chetana Latest PhotosUttej Daughter Chetana Latest Photos
  • Bollywood Heroines At GQ AwardsBollywood Heroines At GQ Awards
  • Nithya PhotosNithya Photos

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు