‘నేను శైలజ’ నిరాశపరిచిందంటున్న రామ్

‘నేను శైలజ’ నిరాశపరిచిందంటున్న రామ్

నేను శైలజ.. యువ కథానాయకుడు రామ్‌కు చాన్నాళ్ల తర్వాత ఓ సక్సెస్ అందించిన సినిమా. వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న రామ్‌.. ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా రొటీన్ సినిమాలు చేసి దెబ్బ తిన్న రామ్.. ఈ సినిమాతో కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. ఐతే దీని తర్వాత మళ్లీ అతను పాత తరహాలోనే ‘హైపర్’ చేశాడు. ఐతే మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ బాటలోకి వెళ్లిపోయావెందుకు అని రామ్‌ను అడిగితే.. ‘నేను శైలజ’తో తన అభిమానులు చాలామంది డిజప్పాయింట్ అయ్యారన్నాడు. తాను ఎనర్జిటిగ్గా కనిపిస్తే.. కమర్షియల్ సినిమాలు చేస్తేనే వారికి ఆనందమని చెప్పాడు.

‘‘నేను శైలజ సినిమా జనాలకు బాగానే నచ్చింది. కానీ మామూలుగా నా సినిమాల్లో.. ముఖ్యంగా నాలో కనిపించే ఎనర్జీ ఇందులో మిస్సయిందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు రెండు రకాలు. కొందరు పూర్తిగా భిన్నమైన సినిమాలు కోరుకుంటారు. మిగతా ప్రేక్షకులు ఇలాంటి సినిమాలతో కనెక్టవరు. వాళ్లకు నన్ను తెరమీద ఎనర్జిటిగ్గా చూడటమే ఇష్టం. నేను వీరోచితంగా కనిపిస్తే తప్ప వాళ్ల ఇగో శాటిస్ఫై అవదు. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలే అందుకు కారణం కావచ్చు. అందుకే ‘నేను శైలజ’ తర్వాత దానికి భిన్నమైన సినిమా చేయాలనుకున్నా. అలాగని ఒక ఫార్ములా ప్రకారం వెళ్లపోకూడదని అనుకున్నా.  ఇందులో కొంచెం సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. కానీ దాన్ని సుగర్ కోటెడ్‌తో చెప్పాం. కమర్షియల్ ఎలిమెంట్లు జోడించాం. ఈ సినిమాలో యునీక్ పాయింట్ ఉంటుంది. అదేంటో ఇప్పుడే చెప్పను. ప్రేక్షకులు దాంతో ఈజీగా కనెక్టవుతారు’’ అని రామ్ తెలిపాడు.

ActressMore »

  • Hansika Latest PhotosHansika Latest Photos
  • Uttej Daughter Chetana Latest PhotosUttej Daughter Chetana Latest Photos
  • Bollywood Heroines At GQ AwardsBollywood Heroines At GQ Awards
  • Nithya PhotosNithya Photos

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు