సీనియర్ నటుణ్ని సరిగ్గా వాడుకున్నారు

సీనియర్ నటుణ్ని సరిగ్గా వాడుకున్నారు

ఓ నటుడికి టాలెంట్ ఉంటే సరిపోదు.. దాన్ని సరిగ్గా వాడుకునే రచయితలు, దర్శకులు కావాలి. తనికెళ్ల భరణిని అలా వాడుకునే దర్శకులు తగ్గిపోయారు తెలుగులో. టాలీవుడ్లో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ల లిస్టు తీస్తే అందులో తనికెళ్ల భరణి పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా చేయగల సామర్థ్యం ఉన్నా ఆయన ప్రతిభకు తగ్గ పాత్రలు ఇవ్వట్లేదు దర్శకులు. ఆమె.. యమలీల.. అతడు.. జులాయి లాంటి సినిమాలు తనికెళ్లలోని నట వైవిధ్యానికి తార్కాణాలుగా నిలుస్తాయి. ఆయన ప్రతిభను చెప్పడానికి ఈ ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఇంకా ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు చాలా ఉన్నాయి. ఐతే భరణికి దక్కేది చాలా వరకు చిన్న పాత్రలే. ఆయన్ని ఫుల్ లెంగ్త్‌ రోల్స్‌లో చూడటం అరుదు.

ఐతే సుమంత్ కొత్త సినిమా ‘నరుడా డోనరుడా’లో మాత్రం భరణికి మంచి పాత్రే దక్కింది. ఈ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. అది కూడా కథలో చాలా కీలకమైన పాత్ర. ఈ సినిమా మాతృక ‘విక్కీ డోనర్’లో అన్ను కపూర్ ఈ క్యారెక్టర్ చేశాడు. ఆ పాత్రలో ఆయన అద్భుతమైన అభినయం ప్రదర్శించాడు. ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఈ పాత్రకు తెలుగులో సరైన ఛాయిస్ భరణినే అని కచ్చితంగా ఒప్పుకుంటారు. ఆయన్ని ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ సాధించేశారని చెప్పొచ్చు. ‘నరుడా డోనరుడా’ ట్రైలర్ చూస్తేనే తనికెళ్ల ఈ సినిమాలో అదరగొట్టాడని అర్థమవుతోంది. ఈ పాత్ర సినిమా అంతటా హిలేరియస్‌గా సాగుతుంది. ఈ క్యారెక్టర్ కచ్చితంగా భరణి కెరీర్లో ఓ మైలురాయిగా నిలవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English