బర్త్ డే... భాయ్!

బర్త్ డే... భాయ్!

అమ్మాయిల పాలిట మన్మధుడు. కుర్రకారు మాత్రం...  అన్న అడుగేస్తే మాస్ అంటారు. ఇక ఆయనలో క్లాస్ కోణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పాతికేళ్ళుగా ప్రేక్షకులు తమకు నచ్చినట్టుగానే ఆయన్ని చూసుకుంటున్నారు. ఇవాల్టి  బర్త్ డే `భాయ్`... నాగార్జున గురించే ఇదంతా. కొత్తదనం అంటే అది నాగార్జున నుంచే రావాలి అన్నట్టుగా ప్రయోగాలకు పూనుకుంటూ ఉంటారాయన. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. నాగార్జున ఇప్పుడు సెంచరీకి చేరువలో ఉన్నారు. అందుకోసం ఓ ప్రత్యేకమైన కథను ఎంచుకొబోతున్నా అంటున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున విలేఖరులతో మాట్లాడుతూ... ``ప్రేక్షకులు తమకు కొత్తదనం కావాలని ఎప్పుడూ అడగరు. నటుడిగా ఆ బాధ్యత నాపైనే ఉంటుంది. అందుకే కొత్తతరహా కథలను ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నా. ప్రయోగాలకు వెనకాడను. అయితే మల్టిప్లెక్స్ థియేటర్ల సంఖ్య పెరిగితేనే ప్రయోగాలు  ఫలితాల్ని ఇస్తాయి`` అన్నారు. పౌరాణిక సినిమాలకు కూడా నేను సిద్ధమే అన్నారు నాగార్జున. మహాభారతం తీస్తామని ఎవరైనా ముందుకొస్తే... అందులో ఎలాంటి  పాత్రనైనా పోషిస్తా  అన్నారు నాగ్. ఈసారి ఆయన పుట్టినరోజు వేడుకలను బెంగళూరులో జరుపుకుంటున్నారు. నాగార్జున ప్రయాణం ఎప్పటికీ ఇలా వైవిద్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది గుల్టే. కామ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు