నాకు ఒక రోల్‌ ఇవ్వండి - మెగాస్టార్

నాకు ఒక రోల్‌ ఇవ్వండి - మెగాస్టార్

హిందీ సినిమాలతో పోలిస్తే.. ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ ఇండియన్ సినిమాలు చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటున్నాయని కితాబిచ్చారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. హైదరాబాద్ గురించి.. తెలుగు సినిమా గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘హైదరాబాద్‌ చాలా ఎగ్జైటింగ్‌, యునీక్ ప్లేస్‌. ఇక్కడి కల్చర్ గొప్పగా ఉంటుంది. పరిసరాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ కరెంటు కోతలు ఉండవని చదివాను. అది చాలా గొప్ప విషయం. సినిమా పరంగా చూసినా హైదరాబాద్ గొప్ప ప్రాంతం. చాలామంది గొప్పవాళ్లు తెలుగు నేల నుంచే వచ్చారు. ఏటా అత్యధిక చిత్రాలు తెలుగులోనే రూపొందుతున్నాయి. టాలీవుడ్ మంచి మార్కెట్‌ ఉన్న పరిశ్రమ. హిందీలో కన్నా ఇక్కడే రిటర్న్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి’’ అని అమితాబ్ అన్నారు.

ఇక సౌత్ సినిమాల్లో నటించడం గురించి అమితాబ్ స్పందిస్తూ.. ‘‘దక్షిణాదిన ఉన్న నా స్నేహితులకి, దర్శకులకు చెప్పేది ఒక్కటే. నాకు ఒక రోల్‌ ఇవ్వండి. బ్యాగ్రౌండ్‌లో ఎక్కడో కనిపించే రోల్ అయినా పర్వాలేదు. చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఐతే ఏ భాషలో నటించినా దానిపై పట్టుంటేనే నటించడం తేలికవుతుంది. అందుకే నా దగ్గరికి స్ర్కిప్టులతో వచ్చేవారికి ఓ మాట చెబుతున్నా. వాళ్లు అనుకున్న పాత్రలో నేను నటించాలంటే ముందు ఆ భాషలో డైలాగులు నేర్చుకోవడానికి నాకు కొంచెం సమయం ఇవ్వాలి’’ అని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు