కోన బ్యాంకు తట్టుకోలేనంత డబ్బట

కోన బ్యాంకు తట్టుకోలేనంత డబ్బట

‘అభినేత్రి’ సినిమాను తెలుగులో అందిస్తున్న కోన వెంకట్ మీద ప్రశంసల జల్లు కురిపించింది మిల్కీ బ్యూటీ తమన్నా. ‘అభినేత్రి’ సినిమాతో ఆయన బ్యాంక్ తట్టుకోలేనంత డబ్బు వచ్చి పడాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. కోనతో తన అనుబంధం గురించి తమన్నా చెబుతూ.. ‘‘నేను చిన్న పిల్లగా ఉన్నపుడే కోన గారు నాకు తెలుసు. నా తొలి సినిమా ‘శ్రీ’ దగ్గర్నుంచే ఆయనతో పరిచయం ఉంది. ఆ సినిమా కథ నాకు నరేట్ చేసింది కోన గారే. ఆ తర్వాత కూడా ఆయనతో మంచి అనుబంధం ఉంది. మా ‘అభినేత్రి’ సినిమాను ఆయనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు బాగా డబ్బులు రావాలి ఆయన బ్యాంకు తట్టుకోలేనంతగా డబ్బులు వచ్చి పడాలి’’ అని తమన్నా చెప్పింది.

‘అభినేత్రి’ కోసం ప్రభుదేవాతో పని చేయడాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని తమన్నా చెప్పింది. ‘అభినేత్రి’ కథను పావు గంట నరేట్ చేయగానే ఒప్పేసుకున్నానని.. ప్రభుదేవా పక్కన నటించడం అనగానే ఇంకా సంతోషం కలిగిందని తమన్నా అంది. ఇప్పటిదాకా డ్యాన్స్ ఏదో అలా వేసుకుంటూ వచ్చేశానని.. ఫస్ట్ టైం ప్రభుదేవా దగ్గర్నుంచి డ్యాన్స్ నేర్చుకునే అవకాశం లభించిందని.. ఇకపై ఆయన్ని గురువుగా భావిస్తానని.. డ్యాన్స్ చేసేటపుడల్లా ఆయన్ని గుర్తు తెచ్చుకుంటానని చెప్పింది. ‘అభినేత్రి’లో మరో కీలక పాత్ర పోషించిన సోనూ సూద్ గురించి చెబుతూ.. ఇప్పటిదాకా అతణ్ని విలన్ పాత్రలతోనే గుర్తుంచుకున్నారని.. కానీ ఈ సినిమాలో రొమాన్స్ కూడా బాగా చేశాడని.. చాలా కొత్తగా కనిపిస్తాడని తమన్నా అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English