ఎఫ్‌బీ హెడ్‌క్వార్టర్స్‌లో ఖాతా ఓపెన్ చేసిన కాజోల్

ఎఫ్‌బీ హెడ్‌క్వార్టర్స్‌లో ఖాతా ఓపెన్ చేసిన కాజోల్

ఫేస్‌బుక్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే ఎక్కణ్ణుంచైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ బాలీవుడ్ స్టార్ కాజోల్ మాత్రం అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న ఎఫ్‌బీ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి మరీ ఖాతా తెరిచింది. ఈ సోషల్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చి చాలా ఏళ్లే గడిచినా కాజోల్‌కు అకౌంట్ లేదు. ప్రస్తుతం, భర్త అజయ్‌ దేవగన్ కొత్త సినిమా 'శివాయ్' ప్రమోషన్స్‌ నిమిత్తం కాజోల్ అమెరికాలో ఉంది. ఈ పర్యటనలో భాగంగానే అక్కడి ఫేస్‌బుక్‌ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లింది. ఉత్సాహంగా తొలిసారి ఎఫ్‌బీలో ఎంటరై ఈ విషయాన్ని అభిమానులందరితో షేర్ చేసుకుంది.

ఫేస్‌బుక్‌లో చేరిన తర్వాత తన ఆనందాన్ని పంచుకుంటూ తల్లి, సోదరిలకు కాజోల్ మెసేజ్‌లు పంపింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. కాజోల్ అందమైన నటి. 90ల్లో షారుక్ ఖాన్‌తో నటించిన సినిమాలతో ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ టాలెంటెడ్‌ నటి ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ ఓపెన్ చేయడంతో ఇదే సమాజిక వేదికలో ఖాతాలున్న ఆమె అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. కాజోల్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని మురిసిపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు