నానికి పంచ్ పడేలా ఉందిగా..

నానికి పంచ్ పడేలా ఉందిగా..

నేచురల్ స్టార్ నాని వరుసగా ఐదో హిట్టు కొట్టేసినట్లే. అతడి లేటెస్ట్ మూవీ 'మజ్ను' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నా సరే.. మంచి ఓపెనింగ్సే సాధించాడు. తొలి రోజే కాక తర్వాతి రెండు రోజుల్లోనూ 'మజ్ను'కు మంచి కలెక్షన్లే వచ్చినట్లు తెలుస్తోంది. బయ్యర్లందరూ సేఫ్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఐతే అమెరికాలో మాత్రం 'మజ్ను' బ్రేక్ ఈవెన్ కు రావడం కష్టంలా ఉంది. ఇది అక్కడ లాస్ వెంచర్ అయ్యేలాగా ఉంది. ఈ సినిమాకు అక్కడ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లేవు. గురువారం ప్రిమియర్లు.. శుక్ర శనివారాలు కలిపితే ఈ సినిమా 2.5 లక్షల డాలర్ల వసూళ్లే వచ్చాయి. ఆదివారం ఓ లక్ష డాలర్లు వస్తే రావొచ్చేమో.

నాని గత సినిమాలతో పోలిస్తే 'మజ్ను'కు వచ్చిన ఓపెనింగ్స్ తక్కువ. ఈ సినిమా హక్కుల్ని యుఎస్ బయ్యర్ రూ.2.5 కోట్లకు కొన్నాడు. అమెరికాలో గ్రాస్ వసూళ్లలో సగానికి సగం ఖర్చులకే పోతాయి. షేర్ మిగిలేది తక్కువ. అక్కడి బయ్యర్ లాభాల బాట పట్టాలంటే 8.3 లక్షల డాలర్లు వసూలు చేశాయి. తొలి వీకెండ్లో ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కుకు చేరువగా వస్తుందని అంచనా వేశారు కానీ.. కలెక్షన్లు చూస్తే అలా లేవు. వచ్చే వారం 'హైపర్' వస్తోంది. ఆ తర్వాత దసరా సినిమాల సందడి మొదలవుతుంది. 'మజ్ను'కు టాక్ బాగుంది కానీ.. మరీ గొప్పగా అయితే లేదు. ఫుల్ రన్లో 6 లక్షల డాలర్ల వరకు వసూలు చేయొచ్చని అంచనా. కాబట్టి ఈ సినిమా బయ్యర్‌ను బయటపడేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు