మహేష్ విలన్ సిక్స్ ప్యాక్

మహేష్ విలన్ సిక్స్ ప్యాక్

ఒకప్పుడు కేవలం బాలీవుడ్ హీరోలు విలన్లు మాత్రమే సిక్స్ ప్యాక్స్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ హీరోలు కూడా ప్యాక్స్ కోసం బాగానే కష్టపడుతున్నారు. తెలుగులో అల్లు అర్జున్.. సుధీర్ బాబు.. ఆది.. కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లు సిక్స్ ప్యాక్స్ చేశారు. మున్ముందు మరింతమంది హీరోలు ఆ కష్టపడతారేమో. మహేష్ బాబు కూడా ‘1 నేనొక్కడే’ సినిమాకు బాడీ బాగానే పెంచాడు. ఆల్మోస్ట్ సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు.

ఐతే ఇప్పుడు మహేష్ విలన్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు. ఆ విలన్ మరెవరో కాదు.. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ ఎస్.జె.సూర్య. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం సిక్స్ ప్యాక్ చేయాలని మురుగదాస్ చెప్పాడట. సరే అని చెప్పి సూర్య కష్టపడుతున్నాడట. ముందు మహేష్ మీదే సన్నివేశాలు తీస్తున్న మురుగ.. ఇంకా విలన్‌ను సీన్లోకి తీసుకురాలేదు.

సిక్స్ ప్యాక్‌తో సినిమాకు తగ్గట్లుగా రెడీ అయ్యాక సూర్య షూటింగుకి రాబోతున్నాడు. సూర్య కోసం మురుగ టిపికల్ క్యారెక్టర్ రెడీ చేశాడట. ప్రస్తుతం తమిళంలో సూర్య మాంచి డిమాండ్ ఉన్న నటుడు. అతడు రూ.50 లక్షల దాకా పారితోషకం తీసుకునే స్థాయికి చేరాడు. అతడి చేతిలో అరడజనుదాకా సినిమాలుండటం విశేషం. నటుడిగా మాంచి ఊపుమీద ఉండటంతో పవన్ కళ్యాణ్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా వదులుకున్నాడు సూర్య. సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడంటే అతను నటనను ఎంత సీరియస్‌గా తీసుకుంటుున్నాడో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు