నాని.. ది హిట్‌ మిషన్‌..

నాని.. ది హిట్‌ మిషన్‌..

ఏడాదిన్నర కింది వరకు నాని ఓ ఫ్లాప్‌ హీరో.. టాలెంట్‌ ఉన్నా అదృష్టం కలిసిరాని హీరో. కానీ భలేభలే మగాడివోయ్‌ తో నాని లక్‌ మారిపోయింది.  ఆ సినిమా 30 కోట్ల వసూళ్ళు సాధించి నానిని స్టార్‌ ని చేసేసింది. ఆ తర్వాత వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాథ కూడా మంచి వసూళ్ళు సాదించింది.  ఇండియా, ఓవర్సీస్‌ లో కృష్ణగాడి వీర ప్రేమగాథ 17 కోట్లకు పైగా వసూలు చేసి ప్రాఫిట్‌ వెంచర్‌ గా మారింది.

ఒకప్పుడు నాని సినిమాలంటే లైట్‌ తీసుకునే ప్రేక్షకులు.. ఇప్పుడు ఆయన సినిమాల కోసం వేచి చూస్తున్నారు. భలేభలే మగాడివోయ్‌ విజయం గాలివాటం కాదని కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌ మన్‌ వసూళ్లే నిరూపించాయి. జెంటిల్‌ మన్‌ కూడా 20 కోట్లకు పైగా వసూలు చేసింది. న్యాచులర్‌ స్టార్‌ అని మారుతి ఏ ముహూర్తాన పెట్టాడో గానీ నిజంగానే నాని ఇప్పుడు స్టార్‌ అయిపోయాడు. ఓవర్సీస్‌ లో అయితే మరీనూ..! నాని సినిమాలకు అక్కడ సూపర్‌ డిమాండ్‌ వచ్చేసింది. హాఫ్‌ మిలియన్‌ మార్క్‌ ను మంచి నీళ్లు తాగినంత ఈజీగా దాటేస్తున్నాడు నాని. ఇప్పుడు మజ్ను కూడా ఓవర్సీస్‌ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. అక్కడ తొలిరోజు కోటికి పైగా వసూలు చేసాడు మజ్ను.

పైగా నాని సినిమాల బడ్జెట్‌ కూడా 10 కోట్లలోపే. సరిగ్గా ప్లాన్‌ చేసుకుని మంచి సినిమా తీసారంటే 25 కోట్లు ఎక్కడికి పోవు. విడుదలకు ముందే సినిమాకు టేబుల్‌ ప్రాఫిట్లు ఖాయం. దానికితోడు శాటిలైట్‌ రైట్స్‌ లో నాని చిన్న సినిమాల సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. మజ్ను కూడా వసూళ్ల పరంగా కాస్త స్లో గా ఉన్నా.. నెమ్మదిగా పుంజుకుంటున్నాడు. మొత్తానికి ఒక్క హిట్‌ కొట్టడానికే నానా తంటాలు పడుతుంటే.. ఏకంగా ఐదు వరస విజయాలతో దుమ్ము లేపేస్తున్నాడు నాని.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English