రాజమౌళి అలా మెరిశాడు

రాజమౌళి అలా మెరిశాడు

మజ్ను సినిమాలో రాజమౌళి అతిథి పాత్ర చేస్తున్నాడన్నది తెలిసిన విషయమే. ఐతే అతను ఎలా కనిపిస్తాడనే అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ చిత్రంలో రాజమౌళి రాజమౌళి లాగే కనిపించాడు. జక్కన్న 'బాహుబలి' తీస్తుంటే.. నాని అక్కడ ఆయనకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అన్నమాట. నాని కంటే ముందుగా సినిమాలో రాజమౌళినే చూపించడం విశేషం. నేరుగా కెమెరా బాహుబలి షూటింగ్‌ స్పాట్లోకి వెళ్తుంది. అక్కడ రాజమౌళి మైకు పట్టుకుని ఆర్డర్స్‌ ఇస్తుంటాడు. హీరో ఎంట్రీ అనగానే గుర్రం మీది నుంచి ఓ వ్యక్తి దిగుతాడు. అతడి ప్రభాసేమో అనుకుంటాం కానీ.. నాని కనిపిస్తాడు. డైలాగ్‌ అనగానే 'బాహుబలి'లోని గ్రాంథిక మాటల్ని తడబడుతూ పలుకుతాడు.

రాజమౌళికి కోపం వచ్చి ఇలాగేనా డైలాగ్‌ చెప్పేది అంటూ మందలిస్తాడు. తర్వాత ప్రభాస్‌ ఎక్కడా అంటే.. ''కారవాన్లో'' అని బదులిస్తాడు నాని. తమన్నా ఎక్కడా అంటే.. ''ఆమె కూడా కారవాన్లోనే..'' అని ఆగుతాడు. రాజమౌళి కోపంగా చూడగానే.. ''ఆమె వేరే కారవాన్లో ఉంది'' అంటాడు. మీ భీమవరం తెలివితేటల్ని ఇక్కడ చూపించకు అని నానికి వార్నింగ్‌ ఇచ్చి.. వాళ్లను తీసుకురమ్మని పురమాయిస్తాడు. నాని వెళ్లిపోయాక రాజమౌళిని పక్కనున్న వ్యక్తి అతణ్ని తీసేద్దామంటారా అంటాడు. ఐతే రాజమౌళి నవ్వేసి.. ''ఈ స్ట్రెస్‌ లో అతనేనయ్యా నాకు రిలీఫ్‌'' అంటాడు.తరవాత నానికి ఫ్రెండు ఇబ్బందుల్లో ఉన్నాడని ఫోన్‌ రాగానే రానా 'బాహుబలి'లో వాడే రథం వేసుకుని బయల్దేరతాడు. అంతటితో బాహుబలి లొకేషన్లో సీన్‌ ఎండవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు