బందిపోటు... నరేష్!

బందిపోటు... నరేష్!

అల్లరోడు `బందిపోటు` అవతారంలో నవ్వించబోతున్నాడు. `అంతకుముందు ఆ తరువాత` అంటూ ఇటీవల ఓ సరికొత్త ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి త్వరలో అల్లరి నరేష్ ని `బందిపోటు`గా తెరపై చూపించబోతున్నాడు. ఇటీవలే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు ముగిశాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. తెరపై స్వచ్చమైన వినోదాలు పండిస్తుంటారు మోహనకృష్ణ. ఆయన అల్లరి నరేష్ శైలికి తగ్గట్టుగా ఓ కథను సిద్ధం చేసుకున్నారు. ఆ కథను వినగానే నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. `బందిపోటు` పేరుతొ ఆ చిత్రం తెరకేక్కబోతోంది. ఎన్టీఆర్ నటించిన `బందిపోటు` ఇటీవలే యాభయ్యేల్లు పూర్తి చేసుకుంది. వగలరాణివి నీవే... అనే పాపులర్ పాట అందులోనిదే. మరి ఈ నయా `బందిపోటు` తెరపై ఎలా వినోదాలు పందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు