గ్యారేజ్ వంద కోట్ల సినిమా అని చెప్పాడట

గ్యారేజ్ వంద కోట్ల సినిమా అని చెప్పాడట

జనతా గ్యారేజ్ డివైడ్‌ టాక్‌తో మొదలైనా భారీ వసూళ్లు సాధించింది. రూ.80 కోట్ల దాకా షేర్.. రూ.130 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఐతే ఈ సినిమా కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని తాను విడుదలకు ముందే అంచనా వేశానని.. ఈ విషయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెప్పానని ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన సాయికుమార్ అన్నాడు. పెద్ద ఎన్టీఆర్‌ నుంచి చిన్న ఎన్టీఆర్‌ వరకు నందమూరి హీరోలందరితో నటించడం తన అదృష్టమని అంటూ.. 'జనతా గ్యారేజ్'లో పని చేసిన అనుభవం గురించి మీడియాతో మాట్లాడాడు సాయికుమార్. ఇంకా ఆయన ఏమన్నారంటే..

''నా మొదటగా డబ్బింగ్ చెప్పింది పెద్ద ఎన్టీఆర్‌తోనే. ఆ తర్వాత 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో ఆయనతో కలిసి నటించడమే కాదు.. దెబ్బలు కూడా తిన్నాను. ఆ తర్వాత బాలయ్యతో రౌడీ ఇన్‌స్పెక్టర్, సీమసింహం చేశాను. కళ్యాణరామ్‌తో 'పటాస్'లో నటించాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్‌ చేశాను. అలా నందమూరి కుటుంబంలోని హీరోలందరితో నటించాను. తారక్‌తో సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ ఆ పెద్దాయనతో చేస్తున్న అనుభూతి కలిగింది. 'జనతా గ్యారేజ్‌'లో చాలామంది గొప్ప నటుల మధ్య నటించడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన కొరటాల శివ గారికి థ్యాంక్స్. జనతా గ్యారేజ్ వంద కోట్ల సినిమా అని నేను ముందే తారక్‌తో అన్నాను. అది నిజమైనందుకు ఆనందంగా ఉంది. పోలీస్ స్టోరీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాకు ఎంత పేరొచ్చిందో.. ఒక డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్‌గా నాకు 'జనతా గ్యారేజ్‌'తో అంతే పేరొచ్చింది. నాకు పోలీసుల్లో చాలామంది అభిమానులున్నారు. దానికి కారణం ఏంటంటే నాకు పోలీసులు చాలా మంది అభిమానులున్నారు. నా 'పోలీస్ స్టోరీ' సినిమా చూసి ఎంతోమంది పోలీసులు స్ఫూర్తిపొందారు'' అని సాయికుమార్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు