ఆ లిప్ లాక్ పై అమితాబ్ క్లారిటీ

ఆ లిప్ లాక్ పై అమితాబ్ క్లారిటీ

రెండు మూడు రోజులుగా అజయ్ దేవగన్ లిప్ లాక్ గురించి తెగ చర్చించేసుకుంటున్నారు హిందీ సినిమా ప్రియులు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'శివాయ్' సినిమా కోసం ఈ సీనియర్ హీరో రేర్ ఫీట్ చేశాడని.. పాతికేళ్ల కెరీర్లో తొలిసారి లిప్ లాక్ సీన్లో నటించాడని.. ఇన్నేళ్లు మడి కట్టుకుని కూర్చున్న అజయ్ తనకు 47 ఏళ్లు వచ్చాక 22 ఏళ్ల సాయేషాతో ముద్దులాడటం ఏమిటో అని మాట్లాడేసుకుంటున్నారు జనాలు. ఐతే సడెన్‌గా ఈ సీన్లోకి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చారు. అజయ్ లిప్ లాక్ గురించి ఆయనో క్లారిటీ ఇచ్చారు.

పాతికేళ్ల కెరీర్లో అజయ్ తొలిసారి లిప్ లాక్‌లో నటించడం అబద్ధమని ఆయన ట్వీట్ చేశారు. 2013లో తాను అజయ్ కలిసి నటించిన 'సత్యాగ్రహ్' సినిమాలోనూ అతను లిప్ లాక్ చేశాడని ఆయన క్లారిటీ ఇచ్చారు. 'సత్యాగ్రహ్'లో అజయ్-కరీనాకపూర్ కలిసి ఓ హాట్ బెడ్ సీన్ చేశారు. అందులోనూ లిప్ లాక్ ఉంటుంది. ఈ విషయాన్ని అమితాబ్ గుర్తుంచుకుని.. ఇలా క్లారిటీ ఇవ్వడం విశేషమే. ఇకపోతే శివాయ్ సినిమాలో అజయ్-సాయేషా లిప్ లాక్ చాలా ప్రత్యేకమైందట. ఆ కిస్ ఏకంగా మూడు నిమిషాలు ఉంటుందని.. ఇండియన్ సినిమాలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన లిప్ లాక్స్‌లో ఒకటని అంటున్నారు. అక్టోబరు 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ డైరెక్షన్ అంటే ముందు జనాలు లైట్ తీసుకున్నారు కానీ.. 'శివాయ్' ట్రైలర్ చూశాక మాత్రం అందరికీ మతిపోయింది. అజయ్ ఏదో సెన్సేషనల్ మూవీనే తీసినట్లు కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు