ప్రేమ రసం కాదు చట్నీ.. డైలాగ్ కథ

ప్రేమ రసం కాదు చట్నీ.. డైలాగ్ కథ

''నీ ప్రేమలో చాలా రసాలున్నాయి భయ్యా.. మరి ప్రేమ'' అని వెన్నెల కిషోర్ అంటే.. ''ప్రేమ రసం కాదు భయ్యా.. చట్నీ'' అంటూ నాని సమాధానం. 'మజ్ను' ట్రైలర్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన.. భలే ఫన్నీగా అనిపించిన డైలాగ్ ఇది. ఐతే ఈ డైలాగ్ రైటర్ కమ్ డైరెక్టర్ విరించి వర్మ కాదట. నాని-వెన్నెల కిషోర్ తమాషాగా మాట్లాడుకుంటుంటే వాళ్లలో ఒకరు సెటైరిగ్గా ఈ డైలాగ్ పేల్చారట.. విరించి దాన్నే సినిమాలో వాడేశాడట.

ఈ అనుభవం గురించి నాని చెబుతూ.. ''విరించి చాలా నిజాయితీ ఉన్న.. సింప్లిసిటీ కలిగిన దర్శకుడు. ఈ సన్నివేశం ఇలాగే ఉండాలి.. ఈ డైలాగ్ ఇలాగే ఉండాలని ఫిక్సయిపోడు. షూటింగ్ సందర్భంగా ఏవైనా ఒంప్రొవైజేషన్స్ చెబితే మార్చుకుంటాడు. తన స్క్రిప్టు మీద సెటైర్లు వేసినా లైట్ తీసుకుంటాడు. నేను, వెన్నెల కిషోర్ ఆ సీన్ చేస్తుండగా.. చాలా సెటైర్లు వేసుకున్నాం. ఆ క్రమంలో మా ఇద్దరిలో ఒకరు 'ప్రేమ రసం కాదు.. చట్నీ' అన్నాం. అంతే విరించి పట్టేశాడు. తర్వాత సీన్ పేపర్లో ఆ డైలాగ్ కనిపించింది. ట్రైలర్లో ఆ డైలాగే హైలైట్ కావడం చాలా సంతోషాన్నిచ్చింది'' అని నాని చెప్పాడు.

'మజ్ను' లెక్కలేసుకుని చేసిన సినిమా కాదని.. విరించి తనకు తెలిసిన కథను నిజాయితీగా చెప్పాడని.. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని నాని చెప్పాడు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి దాకా ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు నిలిచి ఉంటుందని.. చాలా ప్లెజెంట్‌గా అనిపించే సినిమా ఇదని నాని అన్నాడు. తన కెరీర్లో మరో మరపురాని సినిమాగా ఇది నిలిచిపోతుందని.. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని నాని హామీ ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు