నాని మీద ఎంత భరోసా అంటే..

నాని మీద ఎంత భరోసా అంటే..

నేచురల్ స్టార్ నాని మామూలు ఫామ్‌లో లేడు ఇప్పుడు. 15 నెలల వ్యవధిలో నాలుగు హిట్లు కొట్టిన హీరో అతను. ఇప్పుడు ఆరో హిట్టు కోసం 'మజ్ను'గా వస్తున్నాడు. ఈ శుక్రవారమే 'మజ్ను' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని ట్రాక్ రికార్డు.. ఆసక్తికరంగా ఉన్న మజ్ను ట్రైలర్ ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు పెట్టుకునేలా చేశాయి. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. రూ.15 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అమెరికాలో మాత్రమే 'మజ్ను' హక్కుల్ని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.

నాని సినిమాలన్నీ కూడా అమెరికాలో చాలా బాగా ఆడుతున్నాయి. 'ఎవడే సుబ్రమణ్యం' తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ గ్రాసరే కానీ.. అమెరికాలో మంచి వసూళ్లు సాధించింది. ఇక భలే భలే మగాడివోయ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా 1.5 మిలియన్ క్లబ్బుకు చేరువగా వెళ్లింది. కృష్ణగాడి వీర ప్రేమగాథ.. జెంటిల్ మన్ కూడా చెరో 8 లక్షల డాలర్లకు పైగా వసూలు చేశాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా బయ్యర్ మంచి రేటు పెట్టాడు. నాని సినిమా అనగానే అక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి. స్టార్ హీరోల సినిమాల మాదిరి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి 'మజ్ను' ఈజీగా హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెడుతుందని భరోసాతో ఉన్నారు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన 'మజ్ను'లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నాడు. అతడి సరసన కొత్తమ్మాయిలు అను ఇమ్మాన్యుయెల్, ప్రియశ్రీ నటించారు. జెమిని కిరణ్ నిర్మాత. గోపీసుందర్ సంగీతాన్నందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు