బన్నీ డైరెక్ట్ తమిళ మూవీ?

బన్నీ డైరెక్ట్ తమిళ మూవీ?

పొరుగు మార్కెట్లపై మన హీరోలు ఈ మధ్య బాగానే దృష్టిపెడుతున్నారు. తమ ప్రతి సినిమానూ పొరుగు భాషల్లో కొంచెం పెద్దగానే రిలీజయ్యేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం వారు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అల్లు అర్జున్ తనకు తానుగా అంత శ్రద్ధ పెట్టకుండానే అతడికి మలయాళంలో మంచి మార్కెట్ వచ్చేసింది. అక్కడ అతడి సినిమాలు భారీ స్థాయిలో రిలీజవుతున్నాయి. ఇప్పుడు అతడి కళ్లు తమిళ మార్కెట్ మీద పడ్డాయి. ఇందుకోసం అతను ఓ ద్విభాషా చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.

సూర్య కజిన్ జ్నానవేల్ రాజా.. బన్నీని తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాడు. దర్శకుడెవరు.. ఆ సినిమా ఏంటి అన్న విషయాలు బయటికి రాలేదు కానీ.. బన్నీ కథానాయకుడిగా జ్నానవేల్ తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నది కూడా ద్విభాషా చిత్రమే. ముందు తెలుగులో చేసి.. తర్వాత తమిళంలోకి అనువాదం చేయడం కాకుండా.. ఒకేసారి రెండు భాషల్లో చేస్తే తమిళ ప్రేక్షకులు బాగా ఐడెంటిఫై అవుతారని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రావచ్చని సమాచారం. ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు