ఔను.. ఇంద్రగంటికి ప్రమోషన్ వచ్చింది

ఔను.. ఇంద్రగంటికి ప్రమోషన్ వచ్చింది

టాలీవుడ్లో మరో రసవత్తర కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరున్న ఇంద్రగంటి మోహనకృష్ణ.. తొలిసారి టాలీవుడ్లో ఓ పెద్ద ఫ్యామిలీ హీరోతో సినిమా చేయబోతున్నాడు. అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా తన తర్వాతి సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ కాంబినేషన్ గురించి కొన్ని రోజుల ముందు నుంచే వార్తలు వస్తుండగా.. ఇప్పుడు స్వయంగా ఇంద్రగంటే ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. ఇటీవలే మనమంతా, జ్యో అచ్యుతానంద లాంటి మంచి సినిమాలతో పలకరించిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. ఇది ఇంద్రగంటి స్టయిల్లో సాగే ప్రేమకథ అని చెబుతున్నారు.

ఇంద్రగంటి మొదట్నుంచి కొత్తవాళ్లు.. చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది అల్లరి నరేష్‌తో ఆయన తీసిన 'బందిపోటు' పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో ఆయన కెరీర్‌ డోలాయమానంలో పడింది. ఇలాంటి టైంలో తనను హీరోగా చేసిన మోహనకృష్ణకు నాని లైఫ్ ఇచ్చాడు. తనతో జెంటిల్‌మన్ సినిమా చేశాడు. ఆ సినిమా హిట్టయి ఇంద్రగంటిని నిలబెట్టింది. ఆ ఊపులో పెద్ద అవకాశమే సంపాదించాడు ఇంద్రగంటి. 'దోచేయ్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చైతూ.. దసరాకు 'ప్రేమమ్'తో పలకరించబోతున్నాడు. అతడి మరో సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఓపక్క కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా.. మరోవైపు కృష్ణ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా కమిటైన చైతూ.. ముచ్చటగా మూడో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు