నాని సినిమా.. ఊపు లేదబ్బా

నాని సినిమా.. ఊపు లేదబ్బా

ఒకటి రెండు కాదు.. వరుసగా నాలుగు హిట్లు కొట్టేశాడు నాని. సినిమా సినిమాకూ అతడి రేంజి పెరిగిపోతోంది. అతడి సినిమాలకు మాంచి క్రేజ్ వస్తోంది. ఐతే నాని లేటెస్ట్ మూవీ ‘మజ్ను’ విషయంలో మాత్రం అంత ఊపు కనిపించట్లేదు. నాలుగు హిట్లు తర్వాత వస్తున్న సినిమాకు సరిగ్గా ప్రమోషన్ చేసి ఉంటే మాంచి హైప్ ఉండేది. కానీ ఎందుకో తెలియదు కానీ.. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో నిర్మాత అంతగా ఆసక్తి చూపిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది నానికిది మూడో సినిమా. అందులోనూ ‘జెంటిల్‌మన్’ వచ్చిన మూడు నెలలకే ఈ సినిమా రిలీజవుతుండటంతో ప్రేక్షకులు మరీ అంత ఎగ్జైట్మెంట్ తో లేరు. దీనికి తోడు ప్రమోషన్లు కూడా పెద్దగా లేకపోవడంతో కొంచెం లో బజ్ మధ్య సినిమా రిలీజవుతోంది.

ఐతే ‘మజ్ను’ మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్లే ప్రమోషన్ల విషయంలో హడావుడి చేయట్లేదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఏడాది కిందటే స్క్రిప్టు పూర్తి చేసిన విరించి వర్మ.. కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేశాడు. అతడి క్లారిటీకి.. కాన్ఫిడెన్స్‌కు ఇది నిదర్శనం అనుకోవచ్చు. ట్రైలర్ చూస్తే మాత్రం ‘మజ్ను’ కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపించింది. నాని ఖాతాలో మరో హిట్టు పడుతుందన్న అభిప్రాయం కలిగించింది. నాని సరసన అను ఇమ్మాన్యుయెల్, ప్రియాశ్రీ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మించాడు. గోపీసుందర్ సంగీతాన్నందించాడు. ఈ శుక్రవారమే ‘మజ్ను’ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Read More:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు