భేతాలుడు అదరగొట్టాడుగా..

భేతాలుడు అదరగొట్టాడుగా..అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన పనిలేదు. విజయ్‌ ఆంటోనీ విషయంలోనూ ఇదే జరిగింది. నాలుగు నెలల కింది వరకు ఆయనెవరో కూడా టాలీవుడ్‌ లో ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఆ హీరో ఓ స్టార్‌.. బిచ్చగాడు సినిమాతో ఓవర్‌ నైట్‌ లో కోటీశ్వరుడు అయిపోయాడు విజయ్‌. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా ఉంటూ హీరోగా మారిన విజయ్‌.. ఇప్పుడు తెలుగులోనూ సక్సెస్‌ అయ్యాడు. సలీమ్‌, నకిలి సినిమాలతో ఈ హీరోకు తెలుగులో మంచి గుర్తింపే వచ్చింది. కానీ కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు. ఇప్పుడు బిచ్చగాడుతో మనోడు స్టార్‌ హీరో అయిపోయాడు. ఈ సినిమాను 40 లక్షలకు కొంటే.. 25 కోట్లు వసూలు చేసింది.

దాంతో ఇప్పుడు విజయ్‌ ఆంటోనీ సినిమాలపై మన దర్శక నిర్మాతలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ప్రస్తుతం మనోడు సైతాన్‌ అనే సినిమా చేస్తున్నాడు తమిళ్‌ లో. ప్రదీప్‌ కృష్ణమూర్తి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బిచ్చగాడుకు ముందే ఈ సినిమా పోస్టర్స్‌ విడుదలయ్యాయి. కానీ అప్పుడెవ్వరూ ఈ సినిమా రైట్స్‌ కోసం ఎగబడలేదు. కానీ బిచ్చగాడు మ్యాజిక్‌ తర్వాత విజయ్‌ రేంజ్‌ మారిపోయింది. దాంతో సైతాన్‌ కాస్తా తెలుగులో భేతాళుడుగా వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఎప్పట్లాగే ఓ శ్లోకంతో అదరగొట్టాడు విజయ్‌. విజువల్‌ పరంగానూ భేతాళుడు దుమ్ము లేపేసాడు. టీజర్‌ చూస్తుంటే కచ్చితంగా విజయ్‌ ఆంటోనీ ఖాతాలో మరో హిట్‌ పడేలా కనిపిస్తుంది. ఈ చిత్ర తెలుగు రైట్స్‌ 2.5 కోట్లకు వెళ్లినట్లు సమాచారం. ఇదే నిజమైతే గనక నిజంగా విజయ్‌ కు తెలుగులో మార్కెట్‌ భారీగా పెరిగినట్లే.. ఇది హిట్టైతే మనోడు తెలుగులో సెటిలైనట్లే..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు