చిరు సినిమాలో విజయ్ మాల్యా

చిరు సినిమాలో విజయ్ మాల్యా

విజయ్ మాల్యా పోలీసులకే దొరక్కుండా ఉంటే.. ఇక చిరంజీవి సినిమాలో నటించడమేంటి అంటారా? చిరు సినిమాలో మాల్యా ఉండడు. ఆయనను పోలిన క్యారెక్టర్ ఉంటుందట. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ పాత్రను మాల్యా తరహాలో డిజైన్ చేశారట. ఈ విషయాన్ని ఆ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరానే వెల్లడించాడు. తమిళ 'కత్తి'లో నీల్ నితిన్ ముకేశ్ చేసిన పాత్రనే తెలుగులో తరుణ్ చేస్తున్నాడు.

ఈ పాత్ర గురించి అతను చెబుతూ.. ''తమిళ వెర్షన్‌లోని పాత్రలో బేసిగ్గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే దాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర గురించి వినాయక్ గారు నాకు వివరించారు. ఆయన చెప్పినపుడు నాకు విజయ్ మాల్యా గుర్తుకొచ్చారు. ఆయన్ని ఉద్దేశించే ఆ పాత్రను రాశారా అనిపించింది'' అని తరుణ్ చెప్పాడు.  

ఇక తెలుగులో తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తుండటం గురించి తరుణ్ చెబుతూ.. ''నాకు ఇంత కంటే గొప్ప అరంగేట్రం ఏముంటుంది? ఇది నా అదృష్టం. ఐతే మా ఇద్దరి కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలేమీ తీయలేదు. ఒకట్రెండు సీన్స్ తీశారంతే. ఈ లోపు వర్షం వల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. చిరంజీవి గారితో పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చాలా మాట్లాడాలనుంది. తర్వాతి షెడ్యూల్లో ఆయనతో ముచ్చటిస్తా. చిరంజీవి గారితో కలిసి నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు