జయంత్ కొత్త సినిమా.. ఉగ్రం

జయంత్ కొత్త సినిమా.. ఉగ్రం

జయంత్ సి.పరాన్జీ.. తెలుగు ప్రేక్షకులకు అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదిది. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఒకప్పుడు టాప్ డైరెక్టర్‌గా కొనసాగాడు ఈ స్టైలిష్ డైరెక్టర్. అప్పట్లో అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేసిన జయంత్‌కు ఆ తర్వాత కాలం కలిసి రాలేదు. వరుస హిట్లతో ఎలా రైజ్ అయ్యాడో.. వరుసగా ఫ్లాపులతో అలాగే పడ్డాడు.

కొన్నేళ్లుగా టాలీవుడ్లో జయంత్ పేరే వినిపించట్లేదు. చివరగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘తీన్ మార్’ కూడా నిరాశ పరచడంతో సైలెంటుగా ఉంటున్నాడు జయంత్. ఐతే ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు రవితేజ హీరోగా ఓ సినిమా మొదలుపెట్టిన జయంత్.. తాజాగా మరో కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. ఆయన తీయబోయే ఆ సినిమా పేరు ఉగ్రం.

నీలేష్ ఈటి అనే కొత్త హీరో ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తాడట. ఇసాబెల్ అనే అమ్మాయి కథానాయికగా చేస్తుందట. ముంబయి మాఫియాకు.. ఓ పోలీసాఫర్‌కు మధ్య గొడవ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని.. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని జయంత్ చెప్పాడు. నవంబర్లో షూటింగ్ మొదలుపెడతామని.. ముంబయిలో ప్రధానంగా షూటింగ్ ఉంటుందని.. ఒక షెడ్యూల్ హైదరాబాద్‌లో కూడా చేస్తామని జయంత్ అన్నాడు. ఐతే ఈ నీలేష్ ఎవరో.. ఓ కొత్త హీరోతో జయంత్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తీయబోతుండటం ఏంటో అర్థం కావడం లేదు.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు