'రోజా' మ్యాజిక్ రిపీట్ చేయనున్న మణిరత్నం!

'రోజా' మ్యాజిక్ రిపీట్ చేయనున్న మణిరత్నం!

ప్రేక్షకుణ్ణి కట్టిపడేసేందుకు చాలామంది దర్శకులు విదేశీ లొకేషన్లలో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తారు. చిత్రంలో ఏదో సందర్భంలో ఫారిన్ లొకేషన్ చూపిస్తే అదో ప్లస్‌పాయింట్ అని విశ్వసిస్తారు. కానీ ఈ ఫార్ములాను మణిరత్నం పట్టించుకోరు. దేశీ ప్రకృతి అందాలనే తెరపై ఆవిష్కరించేందుకు మొగ్గుచూపుతారు. ఆయన చిత్రాల్లోని పాటలు చూస్తే ఈ విషయం ఈజీగానే అర్ధమైపోతుంది. ఇదిలా ఉంటే, మణి మరోసారి 'రోజా' లాంటి మ్యాజిక్ చేయబోతున్నారు. ఎందుకంటే లేటెస్ట్ పిక్చర్ 'కాట్రు వెళియిదై' కోసం ఆయన భూతల స్వర్గం కాశ్మీర్ లోయలో ప్రత్యక్షమయ్యారు.

కాశ్మీర్‌లోని లద్దాఖ్‌లో మంచి లొకేషన్స్‌ కోసం మణి అన్వేషిస్తున్నారు. అన్నీ కుదిరితే మణి దృక్కోణంలోని అందాల కాశ్మీర్‌ను తెరపై చూడొచ్చు. ఎప్పుడో 90ల్లో వచ్చిన 'రోజా'ను ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేరు. అందమైన ప్రేమకావ్యానికి కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్ తోడవడంతో ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ చరిత్రే 'కాట్రు వెళియిదై' రిపీట్ చేస్తుందా? వేచి చూడాలి. 'కాట్రు వెళియిదై'లో కార్తి, ఆదిరావ్ హైద్రి లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఊటీలో షూట్‌ చేశారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు