సుక్కు బాగోలేదు అనడు.. ఎందుకంటే?

సుక్కు బాగోలేదు అనడు.. ఎందుకంటే?

సినిమా అనేది కొన్ని వందల మంది కష్టం. కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడ్డ వ్యవహారం. వీటన్నింటికీ కేంద్రం దర్శకుడు. ఓ కథ రాయడం.. దాన్ని తెరపైకి తేవడానికి వందల మందిని కోఆర్డినేట్ చేసుకోవడం.. సినిమాను అనుకున్న ప్రకారం పూర్తి చేయడం అన్నది చిన్న విషయం కాదు. సినిమా చూసే ప్రేక్షకులకు ఇదంతా తెలియదు. అందుకే సినిమా గురించి ఒక్క మాటలో తేల్చేస్తారు. ఏమైనా కామెంట్ చేస్తారు. ఐతే ఒక దర్శకుడిగా తాను మాత్రం అలా మాట్లాడలేనని అంటున్నాడు సుకుమార్. ఒక సినిమాను బాగా లేదు అనడం తన వల్ల కాదు అని సుకుమార్ అన్నాడు. అందుకే తాను ఏ సినిమా చూసినా బాగుందనే అంటానని.. ఓ దర్శకుడి కష్టమేంటో తనకు తెలుసని సుకుమార్ చెప్పాడు.

‘‘నాకు తెలిసి అత్యంత కష్టమైన పనుల్లో దర్శకత్వం ఒకటి. ఒక సినిమాను పూర్తి చేయడమే ఒక గొప్ప విజయంగా భావిస్తాను. కథ రాయడం దగ్గర్నుంచి సినిమా పూర్తి చేయడం వరకు చాలా శ్రమ ఉంటుంది. కొన్ని వందల మందితో కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బుర్ర వేడెక్కి పోతుంది. ఇది చాలా చాలా కష్టమైన విషయం. ఒక సినిమా పూర్తి చేసేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. అందుకే నేను ఏ సినిమానూ విమర్శించలేను. ఎవరు ఏ సినిమా గురించి అడిగిగా బాగుందనే చెబుతాను. ఒక దర్శకుడిగా మరో దర్శకుడు ఎంతో కష్టపడి తీసిన సినిమాను బాగా లేదని అనడానికి నాకు మనసు రాదు’’ అని సుకుమార్ అన్నాడు.

Also Read:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు