అది అబద్ధం అనేసిన జీవిత

అది అబద్ధం అనేసిన జీవిత

రెండు రోజుల కిందట టాలీవుడ్లో ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. రాజశేఖర్-జీవితల పెద్ద కూతురు శివాని హీరోయిన్ కాబోతోందని.. సాయి కొర్రపాటి నిర్మాణంలో ఓ యువ దర్శకుడు రూపొందించే థ్రిల్లర్ మూవీలో ఆమె కథానాయిక పాత్ర పోషించబోతోందని.. నాగశౌర్య హీరో అని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. హీరో.. నిర్మాత పేర్లు కూడా బయటికి రావడంతో ఈ న్యూస్ నిజమే అనుకున్నారంతా. కానీ ఇదంతా అబద్ధమే అంటోంది జీవిత. తన కూతురి తెరంగేట్రం గురించి మీడియాలో వచ్చిన వార్తలన్నీ శుద్ధ అబద్ధమని.. ఆమెను హీరోయిన్ చేసే విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.

జీవిత బుల్లితెరలో ఓ షో రన్ చేస్తుండగా.. రాజశేఖర్ దాదాపుగా సినిమాలకు దూరమైపోయారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా ఏదో చేస్తున్నట్లు వార్తలొస్తున్నా.. ఆయన కెరీర్ పుంజుకుంటుందన్న ఆశలేమీ లేవు. మరోవైపు రాజశేఖర్ కూతుళ్లిద్దరూ సినిమాల్లోకి వస్తారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. చిన్నమ్మాయి కొంచెం గ్లామరస్ గా తయారై ఓ ఆడియో వేడుకలో తన డ్యాన్స్ టాలెంట్ కూడా చూపించింది. పెద్దమ్మాయి మాత్రం ఎప్పుడూ చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆమె తెరంగేట్రం గురించి వచ్చిన వార్త ఆసక్తి రేకెత్తించింది. ఐతే శివానిని హీరోయిన్ చేయబోమని జీవిత చెప్పలేదు. ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదని మాత్రమే అంది. కాబట్టి భవిష్యత్తులో ఆమె హీరోయిన్ అయితే ఆశ్చర్యమేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు