ఆ విషయంలో అబ్బాయిలనూ ప్రశ్నించాల్సిందే

ఆ విషయంలో అబ్బాయిలనూ ప్రశ్నించాల్సిందే

'పింక్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ లేటెస్ట్ గా దేశం-మహిళలు-అభివృద్ధిలపై మనసులో మాట బయటపెట్టారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడివారు భారత్ ను అత్యాచార భూమి (ల్యాండ్ ఆఫ్ రేప్స్)గా పిలుస్తున్నారని, అది తనకు చాలా ఆవేదన కలిగిస్తోందని అన్నారు. దేశంలో ప్రతీ ప్రాంతంలోని మహిళలు భద్రంగా ఉండాలని ఢిల్లీ కంటే ముంబై సేఫ్ అని చెప్పలేమని వ్యాఖ్యానించారు.

'పింక్'లో బిగ్ బీ లాయర్ రోల్ పోషించారు. కన్యత్వంపై హీరోయిన్ తాప్సిని క్వశ్చన్ చేస్తారు. ఈ అంశంపై స్పందించిన అమితాబ్ వర్జినిటీపై అమ్మాయిల్నే కాక అబ్బాయిలనూ ప్రశ్నించాలని, ఈ విషయంలో వివక్ష ఉండరాదని అన్నారు.ఇక దేశాభివృద్ధిని ప్రస్తావిస్తూ భారత్ ను మూడో ప్రపంచ దేశం లేదా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్తుంటే విసుగ్గా ఉంటుందని అన్నారు. దేశావృద్ధికి అంతా కలిసికట్టుగా పనిచేసి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సూచించారు.

ఇటీవలే విడుదలైన 'పింక్' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. లాయర్ గా బిగ్ బీకి రైటర్స్ పవర్ ఫుల్ డైలాగులే రాశారు. ఈ డైలాగ్స్ అమితాబ్ పలకడంతో వాటి ఇంటెన్సిటీ మరింత ఎక్కువగా ఉంది. తనకోసం హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ రాసిన రచయితలను మన'పీకూ' స్టార్ మెచ్చుకోవడంతో పాటూ వారి పనితనానికి గర్వపడుతున్నట్లు చెప్పారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు